ETV Bharat / bharat

ముంబయిలో వరద బీభత్సం- లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Sep 23, 2020, 11:06 AM IST

Rainfall causes water-logging in several areas across Mumbai
ముంబయిలో వరద బీభత్సం- లోతట్టు ప్రాంతాలు జలమయం

మహారాష్ట్ర- ముంబయిని భారీ వరదలు ముంచెత్తాయి. భారీ స్థాయిలో కురుస్తోన్న వానలకు ముంబయిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై పెద్దఎత్తున నీరు చేరడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మహారాష్ట్ర- ముంబయిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ శివారు ప్రాంతాల్లో రహదారులు, రైల్వే స్టేషన్​లోని రైల్వే ట్రాక్​లు నీటమునిగాయి. ఫలితంగా సబర్బన్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ముంబయిలో వరద బీభత్సం
Rainfall causes water-logging in several areas across Mumbai
జలమయమైన రోడ్లు- స్తంభించిన ట్రాఫిక్​

థానే-కాసర, థానే-కర్జాత్ , వాషి- పాన్వేల్ పరిధిలో పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. సుదూర ప్రాంతాలకు వెళ్లే ఇతర రైళ్లను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. బుధవారం 5:30 గంటల వరకు శాంతాక్రజ్ లో 27.36, కొలాబాలో 12.22 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించారు.

Rainfall causes water-logging in several areas across Mumbai
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
Rainfall causes water-logging in several areas across Mumbai
రోడ్లపై ప్రవహిస్తోన్న వరదనీరు

ఇదీ చదవండి: పర్యావరణ విధ్వంసానికేనా అనుమతులు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.