ETV Bharat / bharat

సచిన్ 'పవర్​ ప్లే': రంగంలోకి రాహుల్​, ప్రియాంక!

author img

By

Published : Jul 13, 2020, 4:24 PM IST

రాజస్థాన్​ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్​ పైలట్​ను బుజ్జగించేందుకు రాహుల్​, ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. పార్టీ అగ్రనేతలు పైలట్​తో మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Rahul, Priyanka in touch with Pilot
రాజస్థాన్ సంక్షోభం.. రంగంలోకి రాహుల్​, ప్రియాంక!

రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ముగించేందుకు కాంగ్రెస్​ నాయకత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. సచిన్​ పైలట్​ను బుజ్జగించేందుకు కాంగ్రెస్​ అగ్రనేతలు సహా రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సచిన్​ పైలట్​తో రాహుల్​, ప్రియాంక మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​పై తిరుగుబాటు చేయొద్దని కోరినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదులను పార్టీ స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే.. వారి చర్చల్లో ఏమి జరిగిందో ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరుకావాలని పైలట్​ను కోరినప్పటికీ ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపారు.

" ప్రస్తుతం దిల్లీలో ఉన్న సచిన్​ పైలట్​ ఏ నాయకుడి ఫోన్​ కాల్స్​​ స్వీకరించటం లేదు. సందేశాలకూ స్పందించటం లేదు."

- అవినాశ్​ పాండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సచిన్​పైలట్​తో మంతనాలు జరిపిన వారిలో అహ్మద్​ పటేల్​, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ఉన్నారు.

109 మంది మద్దతు..

ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​కు మెజారిటీ లేదన్న సచిన్​ పైలట్​ వ్యాఖ్యలను తోసిపుచ్చింది కాంగ్రెస్​. గహ్లోత్​కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేసింది. గహ్లోత్​ నివాసంలో ఏర్పాటు చేసిన శాసనసభాపక్ష సమావేశానికి వంద మందికిపైగా హాజరైనట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: మాట్లాడుకుందాం రండి: కాంగ్రెస్ బుజ్జగింపులు

రసవత్తరంగా రాజస్థాన్​ రాజకీయం: ముగిసిన సీఎల్పీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.