ETV Bharat / bharat

కుమార్తె పెళ్లికి రిక్షావాలా ఆహ్వానం- మోదీ రియాక్షన్​ అదుర్స్

author img

By

Published : Feb 12, 2020, 2:46 PM IST

Updated : Mar 1, 2020, 2:21 AM IST

సాధారణంగా మధ్యతరగతి ఇంట్లో వివాహానికి బంధువులు, స్నేహితులతో పాటు తెలిసిన కొందరు నేతలను ఆహ్వానిస్తారు. కానీ.. ఉత్తర్​ప్రదేశ్​ వారణాసికి చెందిన ఓ రిక్షావాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపారు. దానికి ప్రధాని బదులిచ్చారు. ఇంతకీ ఆ పేదింటి పెళ్లికి ప్రధాని హాజరవుతున్నారా? లేదా?

prime minister narendra modi
కుమార్తె పెళ్లికి రిక్షావాలా ఆహ్వానం- మోదీ రియాక్షన్​ అదుర్స్

కుమార్తె పెళ్లికి రిక్షావాలా ఆహ్వానం- మోదీ రియాక్షన్​ అదుర్స్

మంగళ్​ ప్రసాద్​ కేవత్​.. ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలో రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈరోజు ఆయన కుమార్తె వివాహం జరుగుతోంది. ఈ పెళ్లికి బంధువులు, స్నేహితులతో పాటు తమ పార్లమెంట్​ నియోజకవర్గ సభ్యులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ ఆహ్వానం పంపారు కేవత్​.

రిక్షావాలా ఆహ్వానానికి స్పందించారు ప్రధాని మోదీ. బదులుగా ఓ లేఖ రాశారు. బిజీ షెడ్యూల్​ కారణంగా పెళ్లికి హాజరుకాలేకపోతున్నానని.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

"పూజ్యులైన మంగళ్​ ప్రసాద్​ కేవత్​ గారికి. కొత్త జీవితం ప్రారంభిస్తున్న నూతన వధూవరులకు నా శుభాకాంక్షలు. వారి జీవితం ఆనందం, సమైక్యత, స్నేహంతో సాగాలని కోరుకుంటున్నాను. కాలక్రమేణా వారి మధ్య సాంగత్యం, జీవితంలో ముందుకు సాగడంలో బంధం బలపడాలని నేను ఆకాంక్షిస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు మోదీ.

ప్రధానమంత్రి నుంచి శుభాకాంక్షలు అందటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మంగళ్​ కేవత్​. స్వయంగా ప్రధానే వివాహానికి హాజరైనట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

"అందరూ మొదటి కార్డును దేవుడి వద్ద ఉంచుతారు. కాబట్టి దిల్లీలో ఉన్న మా దేవుడికి పంపాలని నాకు అనిపించింది. వెంటనే తొలి పత్రికను పంపించాను. ప్రధాని నుంచి మాకు సమధానం వచ్చింది. కూలీ చేసుకునే మా ఆహ్వానానికి ప్రధాని స్పందించి శుభాకాంక్షలు తెలపటం పట్ల మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఆయన్ను మేము దేవుడిగా కొలుస్తాము. పేదల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం."

- మంగళ్ కేవత్​, రిక్షావాలా

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్​ మిషన్​ కోసం​ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2019 జులై 6న కేవత్​ను సత్కరించారు మోదీ.

ఇదీ చూడండి: సూదితో బొడ్డుకు దారాన్ని కుట్టే వింత ఆచారం

Last Updated : Mar 1, 2020, 2:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.