ETV Bharat / bharat

గుజరాత్​లో అభివృద్ధి పనులకు నేడు మోదీ శంకుస్థాపన

author img

By

Published : Dec 15, 2020, 5:15 AM IST

ప్రధాని మోదీ గుజరాత్​లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాన్​ ఆఫ్ కచ్​ను సందర్శించనున్నారు. మోదీ పాల్గొనే సమావేశానికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సైతం హాజరవుతారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

PM Modi to visit Kutch on Dec 15, lay foundation stone of development projects
నేడు గుజరాత్​లో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్​లో పర్యటించనున్నారు. కచ్​లోని దోర్దోను సందర్శించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్కు, ఆటోమేటెడ్ మిల్క్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్, లవణ నిర్మూలణ ప్లాంట్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిపింది. రాన్ ఆఫ్ కచ్​ను సైతం మోదీ సందర్శిస్తారని పేర్కొంది. అనంతరం సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొంటారని వివరించింది.

10 కోట్ల లీటర్లతో..

రోజుకు పది కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసేలా కచ్​లోని మాండవీలో డెస్టినేషన్ వాటర్ ప్లాంటును నెలకొల్పనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. దాదాపు 8 లక్షల మందికి ఈ నీరు సరఫరా అవుతుందని పేర్కొంది. గుజరాత్​లో నిర్మించే ఐదు డెస్టినేషన్​ ప్లాంటులలో ఇది ఒకటని వెల్లడించింది.

మరోవైపు, కచ్​లోని విఘాకోట్​ వద్ద నెలకొల్పే హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్కు.. దేశంలోనే అతిపెద్ద రినేవబుల్ ఎనర్జీ జనరేషన్​ పార్కుగా అవతరించనుంది. 72,600 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు దాదాపు 30 గిగా వాట్ల శక్తిని ఉత్పత్తి చేయనుంది. పవన, సౌర విద్యుత్​ను నిల్వ చేసేందుకు ప్రత్యేక పార్కు ఇందులో ఉండనుంది.

కాగా.. పాల ప్రాసెసింగ్ యూనిట్​ను రూ. 121 కోట్లతో నిర్మించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. రోజుకు రెండు లక్షల లీటర్ల పాలను ఇది ప్రాసెస్ చేయనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.