ETV Bharat / bharat

కొత్త పార్లమెంట్ భవనానికి నేడు మోదీ శంకుస్థాపన

author img

By

Published : Dec 10, 2020, 5:04 AM IST

Updated : Dec 10, 2020, 8:01 AM IST

కొత్త పార్లమెంట్ భవనానికి గురువారం శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, పలువురు ఇతర రాజకీయ పార్టీల నేతలు, పలు దేశాల రాయబారులు హాజరుకానున్నారు. రాష్ట్రాల గవర్నర్​లు, ముఖ్యమంత్రులు వర్చువల్​గా పాల్గొననున్నారు.

Narendra Modi to lay foundation to new Parliament building
నూతన పార్లమెంట్​కు మోదీ శంకుస్థాపన

దేశ నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలకు ప్రధాని భూమి పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒంటిగంటకు భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సర్వ ధర్మ ప్రార్థనను నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు కేంద్ర మంత్రులు, పలు దేశాల రాయబారులు పాల్గొంటారు. రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు వర్చువల్‌గా హాజరవుతారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

కొత్త భవనం అందుకే..

ప్రస్తుత పార్లమెంట్ భవనం వందేళ్లు పూర్తి చేసుకుంటున్నందున.. కొత్త భవన నిర్మాణం తలపెట్టినట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇటీవల చెప్పారు. దేశ విభిన్నతను చాటిచెప్పేలా నిర్మించే ఈ నిర్మాణాన్ని 2022 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదీ చూడండి:దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటేలా నూతన పార్లమెంటు భవన నిర్మాణం

Last Updated : Dec 10, 2020, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.