ETV Bharat / bharat

తొలి సీ-ప్లేన్​ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ

author img

By

Published : Oct 31, 2020, 2:20 PM IST

గుజరాత్​లోని కేవడియాలో దేశంలోనే తొలి సీ-ప్లేన్​ సేవలను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఐక్యతా విగ్రహం నుంచి సబర్మతి వరకు ఈ విమానంలో ప్రయాణించారు మోదీ.

seaplane service in Gujarat
సీ-ప్లేన్​ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలోనే తొలి సీ-ప్లేన్​ సేవలను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేవడియాలోని సర్దార్​ సరోవర్​ డ్యాంకు సమీపంలోని పాండ్​-3 నుంచి ఈ ట్విన్​ ఇంజిన్​ విమానా సేవలను జాతికి అంకితం చేశారు.

తొలి సీ-ప్లేన్​ ప్రారంభం సందర్భంగా కేవడియా నుంచి సబర్మతి వరకు ప్రయాణించారు ప్రధాని మోదీ. సుమారు 40 నిమిషాల పాటు 200 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతి చేరుకున్నారు. అంతకు ముందు కేవడియాలోని నీటి విమానాశ్రయం వద్ద కొంత సమయం గడిపారు ప్రధాని. సీ-ప్లేన్​ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

19 మంది ప్రయాణించేందుకు వీలు కలిగిన ఈ విమానం గుజరాత్​ కేవడియా సమీపంలోని ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్​లోని సబర్మతి మధ్య తిరగనుంది.

seaplane service in Gujarat
ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న సీ-ప్లేన్​
seaplane service in Gujarat
దేశంలోనే తొలి సీ-ప్లేన్​
seaplane service in Gujarat
నీటిపై ఎగురుతున్న సీ-ప్లేన్​

ఇదీ చూడండి: 'సీ-ప్లేన్'తో పర్యటక భారతానికి సరికొత్త కళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.