ETV Bharat / bharat

రాష్ట్రాలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ

author img

By

Published : Nov 1, 2020, 11:18 AM IST

పలు రాష్ట్రాలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, హరియాణా గురించి వర్ణిస్తూ ట్వీట్​ చేశారు.

PM MODI_STATE FORMATION DAY
రాష్ట్ర అవతరణ దినోత్సవ శుబాకాంక్షలు తెలిపిన మోదీ

పలు రాష్ట్రాల అవతరణ దినోత్సవం సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు.. కేరళ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్​గఢ్, హరియాణా రాష్ట్రాలకు ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయా రాష్ట్రాలు సాధించిన ఘనతను గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్​ ప్రజలు చాలా పనుల్లో ఆరితేరి ఉన్నారని మోదీ అభినందించారు. 'కష్టేఫలి' అనే మాటకు వారు నిదర్శనం అని పేర్కొన్నారు.

PM MODI_STATE FORMATION DAY
ఆంధ్రప్రదేశ్​ను అద్దేశిస్తూ మోదీ ట్వీట్

కర్ణాటక సోదర సోదరీమణులకు నా హృదయ పూర్వక 'రాజ్యోత్సవ' శుభాకాంక్షలు అని మోదీ ట్వీట్​ చేశారు. ప్రజల నైపుణ్యంతో రాష్ట్రం ఎంతో ఎత్తుకు ఎదుగుతోందని పేర్కొన్నారు.

PM MODI_STATE FORMATION DAY
కర్ణాటక రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ

ఛత్తీస్​గఢ్ భిన్నమైన సంస్కృతికి నిదర్శనమని కొనియాడిన మోదీ.. ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్​లో మధ్యప్రదేశ్​ పాత్ర కీలకమని ప్రధాని గుర్తుచేశారు. వివిధ రంగాల్లో ఆ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని ట్వీట్​ చేశారు.

PM MODI_STATE FORMATION DAY
మధ్యప్రదేశ్​, చత్తీస్​గఢ్​ను ఉద్దేశిస్తూ మోదీ ట్వీట్

భారత దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న హరియాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ.

PM MODI_STATE FORMATION DAY
హరియాణా గురించి మోదీ ట్వీట్

దేశ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతోన్న కేరళ ప్రజలకు 'కేరళ పిరవి దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ప్రకృతి అందాలకు కేరళ నిలయంగా ఉందని గుర్తుచేశారు.

PM MODI_STATE FORMATION DAY
కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ

ఇదీ చదవండి:ఇమార్తీ దేవీకి ఈసీ షాక్- ప్రచారంపై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.