ETV Bharat / bharat

కశ్మీర్​లో పాక్​ ఆయుధాలు.. ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్​

author img

By

Published : Sep 19, 2020, 10:09 PM IST

Updated : Sep 19, 2020, 11:02 PM IST

Pak uses drone to drop weapons in JK's Rajouri; 3 LeT terrorists arrested
కశ్మీర్​లో పాక్​ ఆయుధాలు.. ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్​

కశ్మీర్​లో మరోసారి పాక్​ ఉగ్రకుట్రను భగ్నం చేస్తూ.. భారీగా పేలుడు పదార్థాలు, నగదును స్వాధీనం చేసుకుంది భారత సైన్యం. దాయాది దేశం నుంచి డ్రోన్ల ద్వారా వచ్చిన ఆయుధాలను తీసుకుంటుండగా.. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్​ చేసింది.

కశ్మీర్​లోని రాజౌరీ జిల్లాకు చెందిన భద్రతా దళాల సంయుక్త బృందం.. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్​ చేసింది. డ్రోన్ల ద్వారా పాక్​ నుంచి తరలిస్తున్న ఆయుధాలను తీసుకుంటుండగా ముష్కరులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి రెండు ఏకే-56 రైఫిల్స్​, 2 పిస్టల్స్​, 4 గ్రెనేడ్​లు, మందుగుండు సామగ్రి సహా.. లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కశ్మీర్​లో శాంతికి భంగం కలిగించేందుకుగానూ.. పొరుగు దేశం డ్రోన్​ల సాయంతో ఇలా దేశంలో ఆయుధాలను వదులుతోందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్​లో పట్టుబడ్డ ముగ్గురిలో ఓ ఉగ్రవాదిది షోపియాన్​. ఇతడు 2020 జూన్​ 4న ఉగ్రవాద ముఠాతో చేతులు కలిపాడు. మిగతా ఇద్దరిదీ పుల్వామా అని గుర్తించారు.

ఇది మూడోసారి..

సెప్టెంబర్​ 11 నుంచి రాజౌరీ, పుంఛ్​​ ప్రాంతాల్లో పాక్​ కుట్రలపై మూడు సార్లు పైచేయి సాధించామని ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీస్​(ఐజీ) ముకేశ్​ సింగ్​ తెలిపారు.

అంతకుముందు బాలాకోట్​ సెక్టార్​లో భారీ ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత.. రాజౌరీలో రూ.11 కోట్లు విలువగల 11కిలోల హెరాయిన్​ను పట్టుకున్నారు.

ఇదీ చదవండి: షోపియాన్​ ఎన్​కౌంటర్​ కేసులో కీలక మలుపు

Last Updated :Sep 19, 2020, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.