ETV Bharat / bharat

కరోనా​ దెబ్బకు నీట్​ పరీక్ష వాయిదా

author img

By

Published : Mar 27, 2020, 8:40 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. మే 3న జరగాల్సిన జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) వాయిదా పడింది. ఈ విషయాన్ని ప్రకటించారు హెచ్​ఆర్​డీ అధికారులు.

NEET 2020 exam postponed due to the coronavirus lockdown, The exam is likely to be held in the last week of May
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్​) వాయిదా

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్​) వాయిదా పడింది. కరోనా వైరస్​ ప్రభావం నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అడ్మిట్​ కార్డులు నిలుపుదల..

షెడ్యూల్​ ప్రకారం మే 3న ఈ పరీక్ష జరగాల్సింది. నేటి నుంచి అడ్మిట్​ కార్డులు జారీ చేయాల్సి ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ నేపథ్యంలో ఆ ప్రక్రియ వాయిదా పడింది.

నీట్​ పరీక్షలో వచ్చిన ర్యాంక్​ ఆధారంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.