ETV Bharat / bharat

వందే భారత్​ మిషన్​: స్వదేశానికి 10 లక్షల మంది

author img

By

Published : Aug 11, 2020, 11:13 AM IST

Updated : Aug 11, 2020, 12:00 PM IST

వందే భారత్​ మిషన్​లో భాగంగా 10 లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరారు. మరో లక్షా 30 వేల మంది విదేశీయులను తమ దేశాలకు చేర్చారు. ఈ మేరకు పౌరవిమానయాన మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరి తెలిపారు.

Nearly one million stranded Indians returned, over 130 K people flown to other countries under VBM
వందే భారత్​ మిషన్​: స్వదేశానికి 10 లక్షల మంది

కరోనా సంక్షోభం వల్ల ప్రపంచంలోని పలు దేశాల్లో చిక్కుకుపోయిన 10 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పౌర విమానయాన మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరి తెలిపారు. వందే భారత్​ మిషన్​లో భాగంగా మరో లక్షా 30 వేల మంది విదేశీయులను తమ దేశాలకు చేరవేసినట్లు వెల్లడించారు. ఇప్పటికీ విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఈ మిషన్​ను​ కొనసాగిస్తామన్నారు పూరి.

ఈ మిషన్​లో భాగంగానే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి మరో ప్రత్యేక విమానం ఏఐ 301... నేడు భారత్​కు రానుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది సిడ్నీలోని భారత రాయబార కార్యాలయం.

ఇదీ చూడండి: తండ్రి ఆఖరి చూపు ఖరీదు రూ. 51,000/-..!

Last Updated : Aug 11, 2020, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.