ETV Bharat / bharat

బిహార్ జాబితాలో శతృఘ్నసిన్హాకు దక్కని చోటు

author img

By

Published : Mar 23, 2019, 3:23 PM IST

బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థుల జాబితాను ఎన్డీయే కూటమి ప్రకటించింది. మొత్తం 40 స్థానాలకు 39 సీట్లలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ జాబితాలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న సీనియర్​ నేత శతృఘ్నసిన్హాను తప్పించారు. ఆయన స్థానంలో పట్నాసాహిబ్​ నుంచి ఈ సారి కేంద్ర మంత్రి రవిశంకర్​ప్రసాద్​ పోటీలో ఉన్నారు.

బిహార్​లోని 39 లోక్​సభ స్థానాలకు ఎన్డీఏ జాబితా

బిహార్​లోని 39 లోక్​సభ స్థానాలకు ఎన్డీఏ జాబితా
లోక్​సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కసరత్తు ముమ్మరం చేసింది ఎన్డీఏ. బిహార్​లో40 స్థానాలున్నాయి. ఇందులో 39 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భాజపా. రాష్ట్రంలో భాజపా, జేడీయూ, ఎల్​జేపీలు కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి.

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర బాధ్యుడు భూపేంద్ర యాదవ్​ జాబితాను విడుదల చేశారు. పార్టీకి కంచుకోటగా ఉన్న పట్నా సాహిబ్​ నుంచి ఈసారి కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి శతృఘ్నసిన్హా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి సిన్హా కాంగ్రెస్​లో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ కారణంతోనే ఆ స్థానంలో రవిశంకర్​ ప్రసాద్​ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది.

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మనకు దిశానిర్దేశం చేశారు. భాజపా, జేడీయూ, ఎల్​జేపీల కూటమి అభ్యర్థుల జాబితా అగ్ర నాయకత్వం సూచనలతో పూర్తి చేశాం. పట్నా సాహిబ్​ నుంచి ప్రస్తుత కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ పోటీ చేస్తున్నారు. లోక్​జనశక్తి పార్టీ పోటీలో ఉండే ఖగాడియాలో అభ్యర్థిని రెండు రోజుల్లో ప్రకటిస్తాం. బిహార్​లోని మూడు పార్టీలతో ఏర్పాటైన కూటమి 40 స్థానాల్లో పోటీ చేయాలని ఎన్డీఏ సంకల్పించింది." - భూపేందర్​ యాదవ్​, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి.

కేంద్రమంత్రి గిరిరాజ్​ సింగ్​ ప్రస్తుత స్థానం నవాడా సీటును ఎల్​జేపీకి కేటాయించింది ఎన్డీఏ. దాంతో బెగూసరాయ్‌ నుంచి సింగ్​ పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రులు రాధామోహన్​ సింగ్​, ఆర్​కే సింగ్​, అశ్విని కుమార్​ చౌబే, రామ్​ క్రిపాల్​ యాదవ్​ వారి వారి ప్రస్తుత స్థానాలు మొతిహరి, అర, బక్సర్​, పాటలిపుత్రాల్లోనే మరో మారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

లోక్​ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పశుపతి కుమార్​ పరస్​ అతని అన్న రామ్ విలాస్​ పాశ్వాన్​ స్థానం హజిపుర్​ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్​ విలాస్​కు రాజ్యసభ టికెట్​ దక్కే అవకాశం ఉంది.

SNTV Daily Planning, 0800 GMT
Saturday 23rd March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Preview of UEFA Euro 2020 Group C qualifier, Netherlands v Germany. Expect Netherlands for 1430. Expect Germany for 1830.
SOCCER: Reaction following Brazil v Panama, international friendly in Porto, Portugal. Expect for 2100.
SOCCER: Former Argentina captain Juan Pablo Sorin plays a mixed-team match alongside Macarena Sanchez, a prominent female player who is taking an unprecedented legal action against the country's football association for alleged inequality. Expect for 2100.
TENNIS: ATP World Tour 1000 series, Miami Open, Miami Gardens, Florida, USA. Times TBA.
TENNIS: WTA's Miami Open, Miami Gardens, Florida, USA. Times TBA.
MOTORSPORT: Sanya ePrix from China, round six in the Formula E Championship. Expect for 1500.
CYCLING: Milan-San Remo one-day race from Italy. Expect for 1800.
CYCLING: Stage 6 of the Cape Epic, starting and finishing at the University of Stellenbosch. Expect for 1600.
WINTER SPORT: FIS Ski Jumping World Cup, Men's HS 240 Team from Planica, Slovenia. Expect for 1200.
WINTER SPORT: FIS Cross Country World Cup, Ladies' 10 km from Quebec, Canada. Expect for 1500.
WINTER SPORT: FIS Cross Country World Cup, Men's 15 km from Quebec, Canada. Expect for 1630.
GYMNASTICS: Highlights from the Artistic Gymnastics Apparatus World Cup in Doha, Qatar, a Tokyo 2020 qualifying event. Expect for 1730.
EXTREME: Highlights from Samla 2019, in Qatar. Time TBA.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.