ETV Bharat / bharat

కరోనా వల్ల 25 ఏళ్ల తర్వాత చిక్కిన నిందితుడు

author img

By

Published : Jun 27, 2020, 5:33 AM IST

హత్య కేసులో 25 ఏళ్లుగా పరారీలో ఉన్న వ్యక్తి కరోనా కారణంగా పోలీసులకు చిక్కాడు. కేరళలో 1995లో ముస్లిం లీగ్​ కార్యకర్త హత్యకేసుతో సంబంధమున్న షఫీక్ పారిపోయి​ ఇన్నేళ్లుగా షార్జాలో ఉన్నాడు. అతనిపై కోర్టు లుక్​అవుట్ నోటీసు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో భారత్​కు తిరిగి రాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి పోలీసులకు అప్పగించారు.

Murder
నిందితుడు

కేరళలో ఓ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 25 ఏళ్ల తర్వాత అరెస్టు చేశారు పోలీసులు.1995లో ముస్లిం లీగ్​ కార్యకర్త మనాఫ్​ హత్య తర్వాత యూఏఈకి పారిపోయాడు షఫీక్ మాలంగదాన్​. కరోనా నేపథ్యంలో తరలింపులో భాగంగా షార్జా నుంచి కోజికోడ్​ రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నీలంబర్​ ఎమ్మెల్యే పీవీ అన్వర్​ అల్లుడు షఫీక్​. బుధవారం కోజికోడ్​ విమానాశ్రయానికి షఫీక్​ చేరుకోగా.. అతనిపై పెండింగ్​లో ఉన్న లుక్​అవుట్​ నోటీసును గుర్తించారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. అనంతరం ఎదవణ్న పోలీసులకు అప్పగించారు.

25 ఏళ్లపాటు..

1995 ఏప్రిల్​ 13న మనాఫ్​ హత్య జరిగింది. ఈ కేసులో 26 మంది నిందితుల జాబితాలో అన్వర్​ కూడా ఉన్నారు. అయితే అనంతరం ట్రయల్​ కోర్టు అతనితో పాటు 21 మందిని నిర్దోషులుగా తేల్చింది. మిగతా నలుగురు నిందితుల్లో.. షఫీక్​, అతని సోదరుడు షెరిఫ్​తోపాటు మరో ఇద్దరు పరారయ్యారు.

వీరిపై కేరళ హైకోర్టు లుక్​అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిగతా ముగ్గురు పోలీసులకు లొంగిపోయారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత షఫీక్​ కూడా అరెస్టయ్యాడు. షఫీక్​ను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ విధించింది.

ఇదీ చూడండి: ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.