ETV Bharat / bharat

'ఇకపై సొంతూళ్లకు సమీపంలోనే ఉపాధి'

author img

By

Published : Jun 20, 2020, 1:05 PM IST

కరోనా వేళ వలస కూలీల కష్టం కలచివేసిందన్నారు ప్రధాని మోదీ. అందుకే వారి కష్టాలు తీర్చేందుకు 'గరీబ్ కల్యాణ్ రోజ్​గార్​ అభియాన్' అమలుచేస్తున్నట్లు చెప్పారు. సొంతూళ్లకు సమీపంలోనే ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

modi
'గరీభ్ కల్యాణ్ ద్వారా సొంతూళ్లకు సమీపంలోనే ఉపాధి'

పేదలు, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కరోనా సంక్షోభంతో సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికులకు తప్పనిసరిగా ఉపాధి కలుగుతుందని భరోసా ఇచ్చారు. వలస కూలీలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో 'గరీబ్ కల్యాణ్ రోజ్​గార్​ అభియాన్​'ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించారు.

రూ. 50వేలకోట్లతో అభివృద్ధి..

పేదలు, గ్రామాల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు మోదీ. కూలీలకు స్వస్థలాలకు సమీపంలో ఉపాధి లభించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.10 వేల కోట్లు జమ చేశామని వెల్లడించారు.

'మీరే స్ఫూర్తి..'

పథకం ప్రారంభానికి కార్మికులే స్ఫూర్తి అని ఉద్ఘాటించారు మోదీ. వలస కార్మికులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. పంచాయతీ భవనాలు, రహదారుల నిర్మాణానికి ఈ పథకం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: వలస కూలీల లబ్ధి కోసం ప్రత్యేక పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.