ETV Bharat / bharat

ట్విట్టర్​ ట్రెండింగ్​గా 'లార్జెస్ట్​ వ్యాక్సిన్ డ్రైవ్'

author img

By

Published : Jan 16, 2021, 8:07 PM IST

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియను ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్​ వేదికగా ప్రధానిని అభినందిస్తున్నారు నెటిజన్లు. హ్యాష్​ ట్యాగ్ 'లార్జెస్ట్​ వ్యాక్సిన్​ డ్రైవ్'​ను ఉపయోగిస్తున్నారు.

largest vaccine drive
ట్విటర్​ ట్రెండింగ్​గా 'లార్జెస్ట్​ వ్యాక్సిన్ డ్రైవ్'

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత్ మొదలుపెట్టడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవైపు 'లార్జెస్ట్ వ్యాక్సిన్‌ డ్రైవ్' పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండగా.. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీని అభినందనలతో ముంచెత్తుతున్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన గంటల వ్యవధిలోనే లార్జెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్.. 4.3లక్షల ట్వీట్లతో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

netizen tweet
నెటిజన్​ ట్వీట్

'ప్రపంచమంతా ఇప్పటికీ కరోనాతో ఇబ్బందులు పడుతుండగా భారతీయులు మాత్రం మోదీ రక్షిస్తారన్న భరోసాతో గుండెలపై చేతులు వేసుకొని ధైర్యంగా ఉన్నారం'టూ ట్వీట్లు చేశారు నెటిజన్లు. ఆర్థిక రంగం విషయంలో కూడా భారతీయులు మోదీపై ధీమాతో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. కుటుంబ పెద్దలా అందరి సంక్షేమాన్ని చూసుకుంటున్నందుకు కృతజ్ఞతలంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశారు. శాస్త్రవేత్తల కృషిని, మోదీ అందించిన తిరుగులేని నాయకత్వాన్ని పొగుడుతూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:భారత్‌లో టీకా పంపిణీ.. ప్రపంచానికి పాఠాలు!

'రాహుల్​జీ.. మన శాస్త్రవేత్తలను ప్రశంసించరా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.