ETV Bharat / bharat

భారత్​లో కరోనా నుంచి కోలుకున్నవారు ఇక్కడే అధికం!

author img

By

Published : Apr 14, 2020, 8:09 AM IST

దేశవ్యాప్తంగా ప్రజలంతా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పాజిటివ్​ కేసులు ఎక్కువవుతున్నాయి. అయితే కేరళలోని ఓ జిల్లాలో మాత్రం వైరస్​ నుంచి కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడా ప్రాంతం యావత్​ దేశానికే ఆదర్శంగా మారింది.

kerala of  Kasaragod district records highest covid-19 recovery rate with 37 percent in India
కరోనా నుంచి కోలుకున్నవారి శాతం దేశంలో ఇక్కడే ఎక్కువ?

భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంటే.. తొలి కేసు నమోదైన కేరళలో పరిస్థితి విభిన్నంగా ఉంది. ప్రకృతి ప్రళయాలు, వైరస్‌ రక్కసులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్న ఈ రాష్ట్రం.. ఇప్పుడు అదే స్థైర్యంతో కొవిడ్‌ మహమ్మారితోనూ గట్టిగా పోరాడుతోంది. అందుకే ఆ రాష్ట్రంలోని కాసరగోడ్​ జిల్లా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఏకంగా ఈ ప్రాంతంలో నమోదైన కేసుల్లో.. 37 శాతం మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి శాతంలో ఇదే అత్యధికం. భారత్​ మొత్తం సగటు 11.4గా ఉండగా.. అమెరికాలో 5.7 శాతం మాత్రమే కొవిడ్​-19 నుంచి బయటప్డడారు.

ఒక్కరోజే 26 మంది...

కాసరగోడ్​లోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 26 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. రెండో దశ వ్యాప్తిలో 165 మందికి కరోనా సోకగా.. 60 మంది కోలుకున్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు వేగవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా కొత్త కేసులు నమోదుకావట్లేదు. సామాజిక సర్వే చేపట్టి కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తోంది అక్కడి యంత్రాంగం. అంతేకాకుండా పూర్తి స్థాయి లాక్​డౌన్​ను పక్కాగా అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు రాబడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం... కేరళలో మొత్తం 376 కేసులు నమోదు కాగా.. 179 కోలుకున్నారు. ముగ్గురు మరణించారు.

14 రోజులుగా కరోనా కేసులు సున్నా:

లాక్​డౌన్​ను పక్కాగా అమలు చేస్తూ.. కరోనా నియంత్రణ చర్యలు పకడ్బందిగా అమలు చేయడం వల్ల వైరస్​ కేసులు తగ్గుతున్నాయి. గతంలో కేసులు నమోదైన 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో.. గత 14 రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • గోండియా(మహారాష్ట్ర),
  • రాజ్​నంద్​ గావ్, దుర్గ్​, బిలాస్​పుర్​(ఛత్తీస్​గఢ్​), ​
  • దేవన్​గిరి, కొడగు, తుముకూరు, ఉడిపి(కర్ణాటక)
  • దక్షిణ గోవా(గోవా)
  • వయనాడ్​, కొట్టాయం(కేరళ)
  • పశ్చిమ ఇంఫాల్​(మణిపుర్​)
  • రాజౌరి(జమ్ముకశ్మీర్​)
  • పశ్చిమ ఐజ్వాల్​(మిజోరాం)
  • మాహే(పుదుచ్చేరి)
  • ఎస్​బీఎస్​ నగర్​(పంజాబ్​)
  • పట్నా, నలందా, ముంగేర్​(బిహార్​)
  • ప్రతాప్​గఢ్​​(రాజస్థాన్​)
  • పానిపట్​, రోహ్​తక్​,సిర్సా(హరియాణా)
  • పౌరీ గర్వాల్​(ఉత్తరాఖండ్​)
  • భద్రాద్రి కొత్తగూడెం(తెలంగాణ)

ఈ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, జిల్లాల్లోని కమాండ్​ సెంట్రల్​ సూచనలు పక్కాగా అమలు వల్లే కరోనా నియంత్రణ సాధ్యమైందని ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: కరోనా కట్టడిలో 'కేరళ మోడల్​' సూపర్ ​హిట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.