ETV Bharat / bharat

'భాజపా కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారు'

author img

By

Published : Jul 26, 2020, 5:30 PM IST

రాజ్యాంగానికి , ప్రజాగళానికి అనుగుణంగా భారత ప్రజాస్వామ్యం నడుస్తుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. భాజపా మోసపూరిత కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్​ నిర్వహిస్తున్న 'స్పీకప్​ఫర్​డెమోక్రసీ' ఆన్​లైన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్.

India's democracy will function in accordance with Constitution, echo voice of people: Rahul
'భాజపా మోసపూరిత కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారు'

రాజస్థాన్​లో అశోక్​ గహ్లోత్​ ప్రభుత్వం సహా ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చేందుకు భాజపా పన్నుతున్న మోసపూరిత కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. భారత దేశ ప్రజాస్వామ్యం.. రాజ్యాంగానికి, ప్రజాగొంతుక నుంచి వచ్చే ప్రతిధ్వనికి అనుగుణంగా నడుస్తుందన్నారు. కాంగ్రెస్​ చేపట్టిన 'స్పీకప్​ఫర్ డెమోక్రసీ' ఆన్​లైన్​ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్. భాజపాపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు హిందీలో ట్వీట్​ చేశారు.

  • भारत का लोकतंत्र संविधान के आधार पर जनता की आवाज़ से चलेगा।

    भाजपा के छल-कपट के षड्यंत्र को नकारकर देश की जनता लोकतंत्र और संविधान की रक्षा करेगी।#SpeakUpForDemocracy

    — Rahul Gandhi (@RahulGandhi) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజస్థాన్​ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబాటుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీనికి కారణం భాజపానే అని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని విమర్శిస్తూ సోమవారం రాజ్​భవన్​ ఎదుట నిరసనలు చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భాజపాపై విమర్శలు చేశారు రాహుల్​.

ఇదీ చూడండి: రాజస్థాన్‌: బలనిరూపణకు కాదు, కరోనాపై చర్చకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.