ETV Bharat / bharat

దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు

author img

By

Published : Sep 16, 2020, 9:33 AM IST

Updated : Sep 16, 2020, 12:03 PM IST

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 90,123 మందికి వైరస్​ సోకింది. మరో 1,290 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య అరకోటిని అధిగమించింది.

India's Coronavirus case tally crosses 50-lakh mark with a spike
దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు

భారత్​లో తాజాగా నమోదైన కరోనా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య అరకోటి దాటింది. గత మూడు రోజుల్లో కాస్త తగ్గుదల కనిపించినా.. కొవిడ్​ కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే మరో 90,123 మంది వైరస్​ బారినపడ్డారు. ఒక్కరోజే 1,290 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 50 లక్షల 20 వేలు దాటింది.

India's Coronavirus case tally crosses 50-lakh mark with a spike
దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు

దేశంలో కోలుకుంటున్న కొవిడ్​ బాధితుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 39.42 లక్షల మందికిపైగా కోలుకోవడం వల్ల రికవరీ రేటు 78.53 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. మరణాలు రేటు 1.63 శాతానికి తగ్గింది.

India's Coronavirus case tally crosses 50-lakh mark with a spike
ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు..!

మరోవైపు కరోనా కట్టడిలో భాగంగా వైరస్​ నిర్ధరణ పరీక్షలను భారీగా నిర్వహిస్తున్నారు. తాజాగా చేసిన 11,16,842 పరీక్షలతో కలిపి... దేశంలో సుమారు 5 కోట్ల 94లక్షల 29వేలకుపైగా నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

India's Coronavirus case tally crosses 50-lakh mark with a spike
రాష్ట్రాలవారిగా కరోనా కేసుల వివరాలు

ఇదీ చూడండి: 'ప్లాస్మా థెరపీతో మరణాలు తగ్గలేదు'

Last Updated : Sep 16, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.