ETV Bharat / bharat

కరోనా 'పేపర్​ టెస్ట్'​కు ఐసీఎంఆర్​ అనుమతి

author img

By

Published : Oct 23, 2020, 1:14 PM IST

ICMR issues advisory for use of Feluda paper strip test
ఈ కాగితపు పరీక్షతో కరోనా పరీక్షలు మరింత వేగిరం

కొవిడ్​ టెస్ట్​లను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా.. మరో పరీక్షను అందుబాటులోకి తెచ్చింది భారత వైద్య పరిశోధన మండలి. యాంటీజెన్​ తరహాలో స్వదేశీయంగా రూపొందించిన ఫెలుదా స్ట్రిప్​ పరీక్షను కొవిడ్​ ప్రయోగశాలల్లో నిర్వహించవచ్చని తెలిపింది.

కరోనాను గుర్తించేందుకు యాంటీజెన్‌ తరహాలో స్వదేశీయంగా తయారు చేసిన ఫెలుదా పేపర్‌ స్ట్రిప్​ పరీక్షను కూడా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబోరేటరీలు నిర్వహించుకోవచ్చని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎం​ఆర్​) స్పష్టంచేసింది. దిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరిశోధకులు దీన్ని అభివృద్ది చేశారు.

కాగితం ద్వారా చేసే ఈ నూతన పరీక్ష విధానంతో గంటలోపే ఫలితాలను పొందవచ్చని ఐసీఎంఆర్‌ పేర్కొంది. వీటి ద్వారా పరీక్ష చేసుకుంటే మరోసారి ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​లకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పరీక్షను భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతించిందని పేర్కొంది.

ఫెలుదా పేపర్‌ స్ట్రిప్‌ పరీక్షను ప్రయోగాత్మకంగా రెండు వేల మందిపై నిర్వహించగా.. 96 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు కేంద్రం ఇటీవలే వెల్లడించింది. ఈ నూతన పరీక్ష వి‌ధానాన్ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ ధృవీకరించాయి.

ఇదీ చదవండి: భారత్​లో మరో 54 వేల కేసులు.. 690 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.