ETV Bharat / bharat

చెన్నైలో భారీ వర్షం- రాకపోకలకు అంతరాయం

author img

By

Published : Jan 5, 2021, 4:54 PM IST

heavy rains in Chennai
చెన్నైలో భారీ వర్షం- రాకపోకలకు అంతరాయం

చెన్నై సమీప ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు జలయయ్యాయి. ఫలితంగా స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

చెన్నైలో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక రహదారులు జలమయం అయ్యాయి. ఫలితంగా స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని విల్లుపురం, చెంగల్​పట్టు, చెన్నై, కాంచీపురం, కడలూరు, నాగపట్టణం, తిరువన్నామలై జిల్లాలో వర్షం సూచనలున్నట్లు తెలిపింది.

heavy rains in Chennai
తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షం

భారీ వర్షాల నేపథ్యంలో చెంబరంబాకం రిజర్వాయర్​లోని మిగులు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొదటి విడతలో దాదాపు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. అడయార్​ నది సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు.

heavy rains in Chennai
జలమయమైన రహదారులు
heavy rains in Chennai
రాకపోకలకు అంతరాయం
heavy rains in Chennai
చెన్నై సమీప ప్రాంతాల్లోనూ భారీ వర్షం

ఇదీ చదవండి:ఫిబ్రవరి తొలి వారంలోనే కాంగ్రెస్​కు కొత్త సారథి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.