ETV Bharat / bharat

రాష్ట్రపతి విందుకు మన్మోహన్ గైర్హాజరు!

author img

By

Published : Feb 24, 2020, 9:31 PM IST

Updated : Mar 2, 2020, 11:08 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకారని సమాచారం. తొలుత రాష్ట్రపతి ఆహ్వానాన్ని మన్మోహన్​ అంగీకరించినప్పటికీ తర్వాత మనసు మార్చుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Manmohan
మన్మోహన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో విందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిరాకరించినట్లు సమాచారం. ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా ఇవ్వనున్న విందుకు పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించారు. అందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలకు ఆహ్వానం పంపారు.

అయితే ఈ విందుకు హాజరయ్యేందుకు మన్మోహన్‌ తొలుత అంగీకరించినప్పటికీ తర్వాత మనసు మార్చుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు సింగ్‌తో పాటు కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ అజాద్‌ సైతం ఈ విందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది.

పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీకిి విందుకు ఆహ్వానం రాకపోవడంపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ విందుకు హాజరవ్వడం లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ ఇప్పటికే స్పష్టం చేశారు.

Last Updated : Mar 2, 2020, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.