ETV Bharat / bharat

రైతుల ఆందోళనలతో ఉద్రిక్తత- సీఎం సభ రద్దు

author img

By

Published : Jan 10, 2021, 2:43 PM IST

Updated : Jan 10, 2021, 5:30 PM IST

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల కలిగే లాభాలను వివరించేందుకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తలపెట్టిన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం పాల్గొనదలచిన సభా ప్రాంగణాన్ని రైతులు ధ్వంసం చేశారు. దీంతో ముఖ్యమంత్రి తన సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

farmers came to protest against kisan panchayat meeting in haryana
'కిసాన్ మహాపంచాయత్'​ సభకు రైతుల నిరసన సెగ

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్ ఖట్టర్.. కర్నాల్​ జిల్లా కైమ్లా గ్రామంలో నిర్వహించ తలపెట్టిన కిసాన్ మహాపంచాయత్​ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నినాదాలు చేస్తూ.. అటువైపు వెళ్తున్న రైతులపై బాష్పవాయువును, నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. సీఎం పాల్గొనదలచిన సభా ప్రాంగణాన్ని రైతులు ధ్వంసం చేశారు. దీంతో ముఖ్యమంత్రి తన సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

farmers came to protest against kisan panchayat meeting in haryana
సభాప్రాంగణానికి వస్తున్న అన్నదాతలు
farmers came to protest against kisan panchayat meeting in haryana
కిసాన్ సభకు వ్యతిరేకంగా తరలివస్తున్న రైతులు
farmers came to protest against kisan panchayat meeting in haryana
భద్రతాబలగాల మోహరింపు

కార్యక్రమం రద్దు..

సభా ప్రాంగణంలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. రైతులు సభలోకి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వారిని అడ్డుకోలేకపోయారు. రైతులు.. సభాస్థలికి వచ్చి స్టేజీని ధ్వంసం చేశారు. కుర్చీలు, టేబుళ్లను పక్కకుతోశారు. ముఖ్యమంత్రి దిగాల్సిన హెలీప్యాడ్​ను కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు భాజపా నేతలు.

farmers came to protest against kisan panchayat meeting in haryana
హెలీప్యాడ్​ను అధీనంలోకి తీసుకున్న రైతులు

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్ ఖట్టర్ ఈ సభను నిర్వహించాలని చూశారు. అయితే.. సీఎంను రానివ్వకుండా అడ్డుకున్నారు రైతులు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు.

farmers came to protest against kisan panchayat meeting in haryana
రైతులను చెదరగొడుతున్న పోలీసులు

ఇదీ చదవండి : కర్షకుల కష్టాలపై గళమెత్తిన చిన్నారి

Last Updated : Jan 10, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.