ETV Bharat / bharat

రాజస్థాన్​ సీఎం సోదరుడి కంపెనీలో ఈడీ సోదాలు

author img

By

Published : Jul 22, 2020, 11:46 AM IST

Updated : Jul 22, 2020, 12:35 PM IST

ED raids at premises of Rajasthan CM's brother
గహ్లోత్​ సోదరుడి కంపెనీలో ఈడీ సోదాలు

12:17 July 22

13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు..

ఎరువుల కుంభకోణానికి సంబంధించి దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ). ఇందులో భాగంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ సోదరుడి కంపెనీలోనూ తనిఖీలు నిర్వహిస్తోంది.  

జోధ్​పుర్​లోని అగ్రసేన్​ గహ్లోత్​కు చెందిన అనుపమ్ కృషి పేరుతో ఉన్న కంపెనీ సహా రాజస్థాన్​, బంగాల్, గుజరాత్​, దిల్లీలోని మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ కుంభకోణంలో రూ.7 కోట్ల కస్టమ్స్​ జరిమానా ఎదుర్కొంటున్నారు అగ్రసేన్​ గహ్లోత్. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్​ఏ) కింద ఛార్జ్​షీట్​ కూడా నమోదు చేసింది ఈడీ.

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈడీ దాడులు చర్చనీయాంశంగా మారాయి.

11:43 July 22

రాజస్థాన్​ సీఎం సోదరుడి కంపెనీలో ఈడీ సోదాలు

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ సోదరుడి ఇంట్లో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. ఓ ఫర్టిలైజర్​ స్కాంకు సంబంధించి ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఈడీ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Last Updated : Jul 22, 2020, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.