ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: దిల్లీలో ట్రాఫిక్​ మార్గదర్శకాలు జారీ

author img

By

Published : Feb 23, 2020, 11:07 PM IST

Updated : Mar 2, 2020, 8:36 AM IST

Delhi Traffic Police issues advisory for February 24, 25
దేశ రాజధానిలో ట్రాఫిక్ నిబంధనలు

ట్రంప్ పర్యటన నేపథ్యంలో దేశ రాజధానిలో ట్రాఫిక్ ఆంక్షలపై​ మార్గదర్శకాలు జారీ చేశారు అధికారులు. తమ ప్రయాణాల్లో మార్పు చేసుకోవాలని ప్రజలతో పాటు వీవీఐపీలకు సూచించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​.. భారత్​ పర్యటన నేపథ్యంలో దిల్లీలో ట్రాఫిక్​ ఆంక్షలుపై మార్గదర్శకాలు జారీ చేశారు అధికారులు. పాటించాల్సిన పలు నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. తమ ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాలని దిల్లీ ప్రజలతో సహా వీవీఐపీలకు సూచించారు.

"భద్రత కారణాల దృష్ట్యా ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం. ఈ రెండు రోజులు(24,25) ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్​తో రద్దీగా ఉండే దిల్లీ కంటోన్మెంట్, గుర్​గావ్​, ధౌలాకాన్​, ఎస్​పీ మార్గ్​, ఆర్​ఎంఎల్​ మోతీబాగ్​, చాణక్యపురి, ఇండియా గేట్​, ఐటీఓ ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు ఉంటాయి. ప్రజలు సహకరించాలి. "

-ట్రాఫిక్ పోలీసు అధికారి

ఆయా మార్గల్లో ప్రయాణించాలనుకొనే వారి కోసం తమ వెబ్​సైట్లో వివరాలు ఉంచామని పోలీసులు వెల్లడించారు. తాజా సమాచారం కోసం వెబ్​సైట్​ను అనుసరించాలని సూచించారు.

ఇదీ చూడండి: ఇక దమ్ము కొట్టాలంటే ఈ వయస్సు దాటాల్సిందే!

Last Updated :Mar 2, 2020, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.