ETV Bharat / bharat

'మహా' విజృంభణ: కొత్తగా 6,875 కేసులు, 219 మరణాలు

author img

By

Published : Jul 9, 2020, 8:28 PM IST

Updated : Jul 9, 2020, 10:43 PM IST

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మరో 4వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు.

COVID-19: Maha adds 6,875 new cases; 219 die, 4,067 recover
మహారాష్ట్రలో ఇవాళ 6,875 కేసులు, 219 మరణాలు

దేశంలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ 6,875 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 219 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,067 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,30,599కి, మరణాలు 9,667కు చేరాయి. ఇప్పటివరకు మొత్తం 1,27,259 మంది కోలుకున్నారు. 93,652 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

తమిళనాడులో..

తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రికార్డు స్థాయిలో 4,231 కొత్త కేసులు నిర్ధరణయ్యాయి. 65 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,26,581కి చేరగా.. మరణాలు 1,765కు పెరిగాయి.

కర్ణాటకలో..

కర్ణాటకలో ఇవాళ 2,228 పాజిటివ్​ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 31,105కి, మరణాల సంఖ్య 486కి చేరింది.

కేరళలో మళ్లీ విజృంభణ

కేరళలో కొద్ది రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇవాళ 339 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,534కు చేరింది.

దిల్లీలో..

దిల్లీలో ఇవాళ 2187 మందికి వైరస్​ సోకింది. కేసుల సంఖ్య 1,07,051కి చేరింది. మొత్తం 3,258 మంది మరణించారు.

రాష్ట్రంకొత్త కేసులుకొత్త మరణాలుమొత్తం కేసులుమొత్తం మరణాలు
మహారాష్ట్ర6,8752192,30,5999,667
తమిళనాడు4,231651,26,8511765
కర్ణాటక2,2281731,105486
కేరళ33906,53427
ఉత్తరాఖండ్​4703,30546
చండీగఢ్​1605237
ఉత్తర్​ప్రదేశ్​1,248031500862
దిల్లీ2,187451,07,0513,258
గుజరాత్​8611539,2802010
Last Updated : Jul 9, 2020, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.