ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: దిల్లీలో మాస్క్​ల ధరలకు రెక్కలు

author img

By

Published : Mar 3, 2020, 11:18 PM IST

Coronavirus scare: Demand for masks, sanitisers shoot up, shortage at stores
కరోనా ఎఫెక్ట్​: నొయిడాలో మాస్క్​ల ధరలకు రెక్కలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీ పరిసర ప్రాంతాల్లో మాస్క్​ల ధరలకు రెక్కలొచ్చాయి. నొయిడాలో 10 రూపాయలకే లభించే సాధారణ సర్జికల్​ మాస్క్​ ధర ప్రస్తుతం రూ.40పైనే ఉంది. 150 రూపాయల ఎన్​95 మాస్క్​ ధర ఏకంగా రూ.500కు చేరింది. వీటికి తోడు షాపుల్లో మాస్క్​లతో పాటు శానిటైజర్స్​ కొరత ఏర్పడింది.

దేశ రాజధాని ప్రాంతంలోని నొయిడాలో కరోనా భయంతో స్థానికంగా మాస్క్​లతో పాటు చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్స్​కు డిమాండ్​ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా అన్ని షాపుల్లోనూ మాస్క్​ల కొరత ఏర్పడింది. వీటికి తోడు వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. సాధారణంగా రూ.10కే దొరికే సర్జికల్​ మాస్క్​ ధర.. ప్రస్తుతం రూ.40పైనే ఉంది. అలాగే ఎన్​95 రకం మాస్క్​ల ధర రూ.150 నుంచి ఏకంగా రూ.500కు చేరింది.

నొయిడాలో కరోనా అనుమానిత కేసు నమోదైందనే వార్త.. ఇవాళ ఉదయం మీడియాలో ప్రసారమైన అనంతరం మాస్క్​లకు డిమాండ్​ విపరీతంగా పెరిగిపోయింది. సాధారణంగా సగటున రోజుకు 10-15 మాస్క్​లు అమ్మే ఫార్మసీల్లో.. నేడు ఆ సంఖ్య 100-200కు చేరింది. ప్రత్యేకించి కరోనాను అరికట్టేందుకు వైద్య నిపుణులు సూచించిన ఎన్​95 మాస్క్​లకే ఎక్కువ డిమాండ్​ నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.