ETV Bharat / bharat

కరోనాకు పతంజలి ఆయుర్వేద మందు

author img

By

Published : Jun 23, 2020, 12:17 PM IST

Updated : Jun 23, 2020, 2:46 PM IST

PATANJALI
పతంజలి

13:30 June 23

coronil
పతంజలి మందు కొరోనిల్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి పేర్కొంది. 'కొరోనిల్‌' పేరుతో ఈ మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు  ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు.

"కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం" 

 - బాబా రాందేవ్

'కొరోనిల్'‌ మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. కరోనా వైరస్‌కు మందును తీసుకువస్తున్నామని గతంలోనే పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తమ మందు 5 నుంచి 14 రోజుల్లో కొవిడ్‌ను నయం చేయగలదని పేర్కొన్నారు.  

12:15 June 23

కరోనాకు పతంజలి ఆయుర్వేద మందు

  • కరోనాకు ఆయుర్వేద మందు తీసుకొచ్చిన పతంజలి సంస్థ
  • ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చన్న బాబా రాందేవ్‌
  • కొరోనిల్‌ పేరుతో మార్కెట్‌లోకి ఆయుర్వేద మందు విడుదల చేసిన రాందేవ్‌
Last Updated : Jun 23, 2020, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.