ETV Bharat / bharat

సరి-బేసి ఉల్లంఘన..భాజపా ఎంపీకి రూ.4వేలు చలానా

author img

By

Published : Nov 4, 2019, 9:12 PM IST

Updated : Nov 5, 2019, 9:52 AM IST

సరి-బేసి ఉల్లంఘన..భాజపా ఎంపీకి రూ.4వేలు చలానా

దిల్లీలో సరి-బేసి నిబంధనను ఉల్లంఘించారు భాజపా రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్. నిబంధన అతిక్రమించినందుకు ఆయనకు రూ.4వేల జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. కేజ్రీవాల్​ ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకే నిబంధన ఉల్లఘించినట్లు తెలిపారు గోయల్.

దిల్లీలో వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి నిబంధనను ఉల్లంఘించారు భాజపా రాజ్యసభ ఎంపీ విజయ్​ గోయల్​. బేసి సంఖ్యతో రిజిస్టర్​ అయిన ఎస్​యూవీ వాహానంలో ప్రయాణించిన ఆయనకు రూ.4వేల చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు.

కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకే ఇలా చేశానని వివరణ ఇచ్చారు గోయల్. సరి-బేసి నిబంధన అమలు చేయడాన్ని.. ఎన్నికల జిమ్మిక్కుగా పేర్కొన్నారు.

గోయల్​పై విమర్శలు..

దిల్లీ ప్రజల పట్ల విజయ్​ గోయల్​ బాధ్యతాయుతంగా వ్యహరించట్లేదని విమర్శించారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా. ఆయనకు కాలుష్య తీవ్రతపై నిజంగా ఆందోళన ఉంటే.. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్​తో సమావేశం ఏర్పాటు చేసి.. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సరి-బేసి నిబంధన పాటిస్తుంటే గోయల్​ మాత్రం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు సిసోడియా.

2016 నుంచి సరి-బేసి

వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీలో 2016 నుంచి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ సమయంలో చివరి రెండు అంకెలు సరి సంఖ్య నంబరుపై రిజిస్టర్ అయిన వాహనాలు ఒకరోజు, బేసి నంబరుపై రిజిస్టర్​ అయిన వాహనాలు మరో రోజు.. సరి-బేసి తేదీలకు అనుగుణంగా రోడ్లపైకి అనుమతిస్తారు. నిబంధనను అతిక్రమిస్తే రూ.4వేలు జరిమానా విధిస్తారు.

దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చినందువల్ల ఈ రోజు నుంచి 15వరకు సరి-బేసి నిబంధన అమల్లోకి తెచ్చారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇది వర్తిస్తుంది.

తొలిరోజు 192 చలానాలు...

మొదటి రోజు నిబంధన ఉల్లఘించిన వారికి 192 చలానాలు విధించినట్లు సిసోడియా తెలిపారు. ఇందులో 170 చలానాలు ట్రాఫిక్ పోలీసులు విధించగా.. రవాణాశాఖ 15, రెవిన్యూ శాఖ 7 చలానాలు విధించినట్లు వెల్లడించారు.

కార్​పూల్

సరి-బేసి నిబంధన అమల్లో ఉన్నరోజుల్లో తమ వాహనాలను ఉపయోగించుకోని వారు ఇతరులకు అవసరముంటే తీసుకువెళ్లేలా సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పోస్ట్​ చేస్తున్నారు. క్యాబ్​ కంటే తక్కువ ధరకే కార్లు అద్దెకు లభిస్తాయని కొంతమంది తెలిపారు. బేసి నిబంధన అమల్లో ఉన్న రోజు బేసి నంబరు గల కారును ఇతరుల నుంచి అద్దెకు తీసుకుని అవసరానికి ఉపయోగించుకోవచ్చని ఓ స్థానికుడు తెలిపారు. ఈ కార్​పూల్ విధానం ద్వారా గతేడాది తాను కొంత లాభపడినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: దేశ​ ప్రయోజనాలకే పెద్దపీట.. ఆర్​సెప్​కు భారత్​ నో

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
DICK CLARK PRODUCTIONS
Beverly Hills, 3 November 2019
1. Fashion shot, Nicole Kidman
2. Fashion shot, Charlize Theron
3. Fashion shot, Antonio Banderas
4. Fashion shot, Antonio Banderas and daughter Stella Banderas
5. Fashion shot, Renee Zellweger
6. Fashion shot, Renee Zellweger and "Judy" co-star Jessie Buckley
7. Fashion shot, Laura Dern
8. Laura Dern and Olivia Wilde hug and pose together
9. Fashion shot, Olivia Wilde
10. Fashion shot, Olivia Wilde and Kaitlyn Dever
11. Fashion shot, Pharrell Williams
12. Fashion shot, Jennifer Garner
13. Fashion shot, Taron Egerton
14. Fashion shot, Cynthia Erivo
15. Fashion shot, Finn Wittrock
16. Fashion shot, Sienna Miller
17. Fashion shot, Shia LaBeouf
STORYLINE:
KIDMAN, THERON, ZELLWEGER, BANDERAS, DERN TURN IT OUT AT HOLLYWOOD FILM AWARDS
Oscar winners Nicole Kidman, Charlize Theron and Renee Zellweger were among the A-list celebrities who turned it out at the Hollywood Film Awards.
Theron, who received a Hollywood Career Achievement Award at the ceremony in Beverly Hills on Sunday night (3 NOV), wore a black pant and a bedazzled tunic, while Kidman opted for a high-necked, white floral dress and Zellweger donned a form-fitting black dress with a dramatic neckline.
Zellweger also was among the honorees, receiving a Hollywood Actress Award. Among other attendees who were honored were Antonio Banderas, Laura Dern, Olivia Wilde, Pharrell Williams, Shia LaBeouf, Cynthia Erivo and Taron Egerton.
The Hollywood Film Awards have celebrated the industry and the launch of award season since 1997.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated :Nov 5, 2019, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.