ETV Bharat / bharat

బంగాల్​లో మరో భాజపా కార్యకర్త మృతి

author img

By

Published : Dec 13, 2020, 9:46 PM IST

BJP activist found dead near home in Bengal's East Burdwan
బంగాల్​లో భాజపా కార్యకర్త అనుమానాస్పద మృతి

బంగాల్​లో ఓ భాజపా కార్యకర్త అనుమానస్పదంగా మృతి చెందాడు. అయితే.. అతడిని టీఎంసీ కార్యకర్తలే హత్యచేశారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని ఆ పార్టీ ఖండించింది.

బంగాల్​లో భాజపా కార్యకర్త అనుమానస్పద మృతి కలకలం సృష్టించింది. తూర్పు బర్ధమాన్​​లోని తన ఇంటి సమీపంలో భాజపా కార్యకర్త సుఖ్​దేవ్​ ప్రమాణిక్​ మృతదేహం లభ్యమైంది. రెండురోజుల క్రితం భాజపా ఆధ్వర్యంలో జరిగిన ఓ ర్యాలీ అనంతరం సుఖ్​దేవ్​ అదృశ్యమవ్వగా.. పూర్వాస్థలి ప్రాంతంలోని ఓ చెరువులో విగతజీవిగా కనిపించాడు. పోస్టుమార్టం కోసం సుఖ్​దేవ్​ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

అయితే.. సుఖ్​దేవ్​ను అధికార తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ నేతలే హత్య చేశారని భాజపా ఆరోపించింది. ఈ విషయమై.. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని నేతలు తెలిపారు. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్​ చేశారు. భాజపా ఆరోపణలను టీఎంసీ ఖండించింది. రానున్న ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రతి అనుమానస్పద మృతిని తమ పార్టీపై నెట్టేందుకు భాజపా యత్నిస్తోందని దుయ్యబట్టింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి, ఆ పార్టీ నేత ఫిర్హాద్​ హకీమ్.. తమ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడదని పేర్కొన్నారు.

మరో భాజపా నేత సైకత్​ భావల్​ హత్య జరిగిన మరుసటిరోజే.. సుఖ్​దేవ్​ మృతదేహం లభ్యం కావడం గమనార్హం. ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన ఓ దాడిలో సైకత్​ మృతి చెందారు.

ఇదీ చూడండి:భాజపా అధ్యక్షుడు నడ్డాకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.