ETV Bharat / sports

'నా రక్తంలోనే అది ఉంది - కోహ్లీ ఎంతో ప్రత్యేకం' - Usain Bolt Kohli

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 10:02 PM IST

T20 world cup Usain Bolt Kohli : జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ భారత స్టార్ క్రికెటర్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. అలాగే తన ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ల గురించి తెలిపాడు. పూర్తి వివరాలు స్టోరీలో. Source ANI

Source ANI
usain bolt kohli (Source ANI)

T20 world cup Usain Bolt Kohli : దాదాపుగా మరో రెండు వారాల తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ మొదలు కానుంది. మెగా టోర్నీ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌ కప్‌ 2024కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన 8 ఒలింపిక్ గోల్డ్‌ మెడల్స్‌ విజేత, ఉసేన్ బోల్ట్ భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంకా క్రికెట్​ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడు.

క్రికెట్‌ నా బల్డ్‌లోనే ఉంది - "మా నాన్న క్రికెట్​కు వీరాభిమాని. జమైకాకి చెందిన నా రక్తంలోనే క్రికెట్‌ ఉంది. ఇప్పుడు క్రికెట్‌కు అంబాసిడర్‌గా ఉండటం అద్భుతం. నాకు T20 ఫార్మాట్‌ అంటే ఇష్టం. వరల్డ్‌ కప్‌ ద్వారా యూఎస్‌లో క్రికెట్‌ను ప్రోత్సహించడం సంతోషంగా ఉంది." అని బోల్ట్​ పేర్కొన్నాడు.

కోహ్లీ ఎంతో ప్రత్యేకం - "ఇప్పుడు చాలా మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ కోహ్లీ అందరికంటే ప్రత్యేకం. అతడు గ్లోబల్‌ పాపులారిటీ, ఇన్‌ఫ్లూయెన్స్‌ ఎంతో గొప్పవి. అతని కోసమే అభిమానులను స్టేడియంకు తరలి వస్తారు. ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లోని స్టేడియాలకు ఫ్యాన్స్‌ భారీగా వస్తుంటే, అందుకు సగం కారణం విరాట్ కోహ్లీనే." అని బోల్ట్​ చెప్పాడు.

కాగా, టోర్నమెంట్ తర్వాత టీ20 నుంచి కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్‌ అవుతారని నివేదికలు వస్తున్నాయి. కోహ్లీకి రాబోయే ఈ T20 ప్రపంచ కప్ ఎంతో కీలకం. సీనియర్ ఆటగాడిగా ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అతడు పోరాడబోతున్నాడు. ఈ కారణాలు కూడా టీ20 వరల్డ్‌ కప్‌పై మరింత ఆసక్తిని పెంచాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.