ETV Bharat / bharat

ఆడియో టేపుల కేసులో హైకోర్టుకు రెబల్​​ ఎమ్మెల్యే

author img

By

Published : Jul 29, 2020, 6:54 AM IST

రాజస్థాన్​లో ఇటీవల దుమారం రేపిన ఆడియో టేపుల కేసులో హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్​ రెబల్​ ఎమ్మెల్యే భన్వర్​లాల్​ శర్మ. ఈ అంశంలో తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను రద్దు చేయాలని న్యాయస్థానానికి విన్నవించారు.

Audiotape case
ఎఫ్​ఐఆర్​ రద్దు కోసం హైకోర్టుకు పైలట్​ వర్గం​ ఎమ్మెల్యే

రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో దుమారం రేపిన ఆడియో టేపుల కేసులో హైకోర్టును ఆశ్రయించారు సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యే భన్వర్​లాల్​ శర్మ. టేపుల అంశంలో తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను రద్దు చేయాలని కోరారు.

ఎమ్మెల్యేల కొనుగోలుతో ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రపన్నుతూ.. ఓ కేంద్ర మంత్రితో మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఈ కేసును రాజస్థాన్​ పోలీసు ప్రత్యేక బృందం (ఎస్​ఓజీ) నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ)కు బదిలీ చేయాలని డిమాండ్​ చేశారు శర్మ.

ఆడియో టేపులు బయటకు వచ్చిన క్రమంలో కాంగ్రెస్​ ఫిర్యాదు మేరకు జులై 17 భన్వర్​లాల్​ శర్మపై ఎప్​ఐఆర్​ నమోదు చేశారు ఎస్​ఓజీ పోలీసులు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​పై మాయ ఫైర్.. ఎమ్మెల్యేల విలీనంపై కోర్టుకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.