ETV Bharat / bharat

అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉంటా: నిర్భయ తల్లి

author img

By

Published : Dec 16, 2020, 8:25 PM IST

డిసెంబరు 16, 2012 తేదీ.. యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిర్భయ ఘటన జరిగి ఈ రోజుతో ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశా దేవి.. ఈటీవీ భారత్​తో తన కుమార్తె చివరి క్షణాల్లో ఉన్న సందర్భాలను గుర్తు చేసుకున్నారు. నిర్భయ చికిత్స పొందుతున్న సమయంలో తనకు తాగడానికి కనీసం చుక్క నీరు కూడా అందించలేకపోయానని వాపోయారు. ప్రస్తుతం ఉన్న న్యాయవ్యవస్థలో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయని తెలిపారు. న్యాయం కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానన్నారు.

Nirbhaya
నిర్భయ ఘటన

దేశ రాజధాని నడిబొడ్డులో నిస్సహాయ స్థితిలో ఉన్న నిర్భయపై కామాంధుల కర్కశ చర్యకు యావత్​ దేశం ఉలిక్కిపడింది. ఏడేళ్ల తర్వాత దోషులను ఉరి తీయటంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరింది. నిర్భయ ఘటన జరిగి నేటికి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న ఆనాటి సంఘటనలపై పలు విషయాలను ఈటీవి భారత్​తో వెల్లడించారు నిర్భయ తల్లి ఆశాదేవి. బాధితులు సత్వర న్యాయం పొందాలంటే న్యాయవ్యవస్థలో మార్పులు అవసరమని తెలిపారు. వ్యవస్థలో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయన్నారు.

నిర్భయ తల్లి ఆశాదేవి

తాగడానికి చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయా..

తన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కనీసం చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు ఆశాదేవి.

"ఘటన తర్వాత 12-13 రోజుల వరకు ఆమె బతికే ఉన్నా.. తను నీరు కూడా తాగలేని స్థితిలో ఉంది. ఆమె శరీరం నీటిని కూడా తీసుకోలేని స్థితిలో ఉందని వైద్యులు చెప్పారు. ఇప్పటికీ తనకు తాగడానికి చుక్కనీరు ఇవ్వలేకపోయాననే బాధ నన్ను వెంటాడుతోంది."

- ఆశా దేవి, నిర్భయ తల్లి

అన్యాయంపై పోరాడుతా..

నిర్భయకు న్యాయం జరిగే వరకూ మద్దతుగా నిలిచిన అందరికీ ఆశా దేవి కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతుగా నిలుస్తూ.. పిల్లలు, యువతీయువకులు పోరాడిన విధానం తాను మర్చిపోలేనని అన్నారు. ఆ స్ఫూర్తితోనే తాను కూడా అన్యాయంపై పోరాడాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.

ఎన్నో మెలికలు..

నేరస్థులు ఉన్న జైలుకు సంబంధించి 2018లో రూపొందించిన నిబంధనల పత్రంలో లోపాలు ఉన్నాయని తెలిపారు ఆశా దేవి. ఇవే కేసులో జాప్యం జరగడానికి కారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలో మార్పులు జరిపితేనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: నిన్న నిర్భయ.. నేడు హాథ్రస్.. కేసేదైనా పోరాటం సీమదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.