ETV Bharat / bharat

'రాహుల్​- పైలట్​ మధ్య వివరణాత్మక చర్చ'

author img

By

Published : Aug 10, 2020, 8:40 PM IST

రాజస్థాన్​ తిరుగుబాటు ఎమ్మెల్యే సచిన్​ పైలట్​.. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీతో సమావేశమై తన సమస్యలను వివరించినట్లు చెప్పారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​. ఇరువురి మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు చెప్పారు. పైలట్​ లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

AICC will constitute a three-member committee
'పైలట్​ సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ'

రాజస్థాన్​ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్​ పైలట్​ మనసు మార్చుకుని తిరిగి పార్టీలోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు.

ఈ భేటీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్​ నేత కేసీ వేణుగోపాల్​. పైలట్​ లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఏఐసీసీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు సోనియా గాంధీ నిర్ణయించినట్లు తెలిపారు.

" కాంగ్రెస్​ మాజీ అధ్యక్షులు రాహుల్​ గాంధీతో సచిన్​ పైలట్ సమావేశమై తన సమస్యలను వివరించారు. వారి మధ్య స్పష్టమైన, వివరణాత్మక చర్చ జరిగింది.​ పైలట్​ రాజస్థాన్​లోని కాంగ్రెస్​ పార్టీ, ​ ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేయడానికి కట్టుబడి ఉన్నారు. ఈ సమావేశం తర్వాత​ పైలట్​, ఆయన వర్గం ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఏఐసీసీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ​ నిర్ణయించారు."

- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి

ఇదీ చూడండి: సచిన్ పైలట్​ యూటర్న్- రాహుల్​తో చర్చలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.