ETV Bharat / bharat

సచివాలయంలో అగ్నిప్రమాదం- రాజకీయ దుమారం

author img

By

Published : Aug 25, 2020, 8:40 PM IST

Updated : Aug 25, 2020, 9:01 PM IST

A fire broke out at Kerala Secretariat today; the fire has been doused. No injuries reported.
సచివాలయంలో అగ్నిప్రమాదం- రాజకీయాల్లో దుమారం

20:55 August 25

పోలీసు చర్య!

  • Thiruvananthapuram: Police use water cannons to disperse protesters outside the Kerala Secretariat.

    BJP & Congress were holding protest alleging that the fire that broke out at Secretariat today was a conspiracy to destroy evidence in connection with #GoldSmugglingCase. pic.twitter.com/EdZ1xHZwJY

    — ANI (@ANI) August 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేరళ అగ్నిప్రమాద ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ సచివాలయం బయట నిరసన చేపట్టిన వివిధ పార్టీల నేతలపై పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.  

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆధారాలు నాశనం చేసేందుకు కావాలనే అగ్నిప్రమాద కుట్ర పన్నుతున్నారని భాజపా, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

20:44 August 25

ఫైళ్లు సేఫ్- క్రైం బ్రాంచీతో విచారణ

కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో కీలక పత్రాలేవీ నాశనం కాలేదని అధికారులు వెల్లడించారు. అన్ని పత్రాలు భద్రంగానే ఉన్నాయని.. ఈ-దస్తావేజుల ద్వారా సమాచారం అంతా తిరిగి రాబట్టవచ్చని పేర్కొన్నారు.  

ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలో ఇద్దరు మాత్రమే ఉన్నారని అధికారులు చెప్పారు. మిగతా సిబ్బంది క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపారు.  

మరోవైపు ఈ ఘటనలో క్రైం బ్రాంచీ ద్వారా విచారణకు ఆదేశించింది కేరళ ప్రభుత్వం.

20:32 August 25

రాజకీయాల్లో దుమారం

కేరళ అగ్నిప్రమాద ఘటనపై రాజకీయ వర్గాల్లో దుమారం చెలరేగింది. భాజపా, కాంగ్రెస్ వర్గాలు సచివాలయం వెలుపల నిరసన ప్రదర్శనకు దిగాయి.  

మంటలు ప్రమాదవశాత్తు వ్యాపించలేదని బంగారం అక్రమ రవాణా(గోల్డ్​ స్మగ్లింగ్​)కు సంబంధించిన ఆధారాలను నాశనం చేసేందుకే ఈ కుట్రపన్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కే సురేంద్రన్ ఆరోపించారు.

"గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మంత్రి కేటీ జలీల్​కు సంబంధించి ఎన్​ఐఏ స్వాధీనం చేసుకున్న పత్రాలను కావాలనే తగులబట్టారు. నిజాన్ని బయటపెట్టేందుకు మేం సచివాలయానికి వెళ్తే నన్ను, భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు."

-కే సురేంద్రన్, భాజపా అధ్యక్షుడు  

కాంగ్రెస్

ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని కేరళ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల అభిప్రాయం వ్యక్తం చేశారు.  

"బంగారం అక్రమ రవాణాకు సంబంధించి ముఖ్యమైన దస్త్రాలు పూర్తిగా నాశనమయ్యాయి. దీనికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ బాధ్యత వహించాలి."

-రమేష్ చెన్నితల, కాంగ్రెస్ నేత

అగ్నిప్రమాద ఘటనపై కేరళ గవర్నర్​ను కలిశారు రమేష్. తమ అనుమానాలను గవర్నర్​కు వివరించారు.

20:10 August 25

కేరళ సచివాలయం​లో అగ్ని ప్రమాదం జరిగింది. సెక్రటేరియట్​లోని నార్త్​ బ్లాక్​ ప్రొటోకాల్​ విభాగంలో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కంప్యూటర్​లో తలెత్తిన షార్ట్​ సర్క్యూట్​ వల్లే మంటలు అంటుకొని ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Last Updated : Aug 25, 2020, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.