ETV Bharat / bharat

సర్కారు బాధ్యతను గుర్తు చేసిన ఎనిమిదేళ్ల చిన్నారి!

author img

By

Published : Dec 13, 2019, 1:25 PM IST

అమ్మ, నాన్న, ఇల్లు, బడి తప్పా ఏమీ తెలియని వయస్సు ఆమెది .. కానీ ప్రపంచ వేదికపై భవిష్యత్తును కాంక్షించింది. పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతూ వేలాది మందిని సంఘటితం చేస్తోంది. భవిష్యత్​ తరాలను కాపాడుకోవడంలో భారత సర్కార్ బాధ్యతను గుర్తు చేసిన ఎనిమిదేళ్ల లిసిప్రియ కంజుగం.. ఐక్యరాజ్యసమితి వేదికగా తన గళాన్ని వినిపించింది.

8year old kid speak in united nations
ఎనిమిదేళ్లకే ఐరాసకెక్కింది


మా భవిష్యత్తును కోల్పోవడం అంటే ఎన్నికల్లో ... స్టాక్‌ మార్కెట్‌లో.. సంఖ్యలు తగ్గిపోవడంలాంటిది కాదు. మీరు కన్నబిడ్డలం మేం. మమ్మల్ని ఎటువంటి ప్రపంచంలో పెంచాలో మీరే నిర్ణయించండి. భారత ప్రభుత్వానికి నేను చేసే డిమాండ్‌లు మూడు. 'జీరో కార్బన్‌ విడుదలకు వాతావరణ చట్టం తీసుకురావాలి, 'వాతావరణ మార్పులు' పేరుతో పాఠ్యాంశాలు చేర్చాలి, ప్రతి విద్యార్థి ఏటా మొక్కలను నాటేలా ప్రోత్సహిస్తూ, పెంచిన వృక్షాల ఆధారంగా డిగ్రీ ఇవ్వాలి'. భూగోళ పరిస్థితిని మెరుగుపరచడమే నా జీవితధ్యేయం. భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రవేత్తనవుతా. ఎందుకంటే... త్వరలో మనం నివసించే ఈ భూమి అంతరించనుంది. ఆ తరువాత మనం జీవించడానికి స్థలం కనుక్కోవడం కోసమే. చంద్రుడు, మార్స్‌ గ్రహాలపైకి రాకెట్‌ను పంపి, అక్కడ జీవించడం వీలవుతుందా లేదా అని తెలుసుకుంటా...

ఈ మాటలన్నది ఎవరోకాదు, ఏడేళ్లప్పుడే పర్యావరణ కార్యకర్తగా మారిన మణిపూర్‌కు చెందిన అతిచిన్న వయస్కురాలు ఎనిమిదేళ్ల లిసిప్రియ కంజుగం. వాతావరణాన్ని మార్చే చట్టాన్ని తెమ్మంటూ గతేడాది పార్లమెంటు ఎదుట పోరాటం చేసింది. దిల్లీలో 'ఇండియా గేట్‌ వద్ద 'గ్రేట్‌ అక్టోబరు మార్చ్‌'పేరుతో వేలాదిమంది మద్దతుదారులను కలుపుకొని ఏడు రోజులపాటు మార్చ్‌ చేసింది. విపత్తు నిర్వహణపై మన దేశం తరఫున ప్రతినిధిగా జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ప్రసంగించింది. ఇందులో 140 దేశాలకు చెందిన మూడు వేలమంది ప్రతినిధులు హాజరవడం విశేషం. ప్రస్తుతం 'ఇంటర్నేషనల్‌ యూత్‌ కమిటీలో ఛైల్డ్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌'కు న్యాయవాదిగా ఉంది. ఇప్పటికే 'వరల్డ్‌ చిల్డ్రన్స్‌ పీస్‌ ప్రైజ్‌', 'ద ఇండియా పీస్‌ ప్రైజ్‌', 'డాక్టర్‌ ఏపీజె అబ్దుల్‌ కలాం చిల్డ్రన్స్‌ అవార్డు'లను అందుకుంది.

ఇబ్బందులెన్నెదురైనా...

విదేశాల్లో నిర్వహించే సదస్సులకు ఓ వైపు క్రౌడ్‌ ఫండ్‌ సహాయం అందినా కూడా, లిసిప్రియకు ఆమె తల్లిదండ్రుల సహకారం పూర్తిగా ఉంది. దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో లిసిప్రియ పోరాటానికి వారు ఓ వైపు మద్దతునిస్తున్నా.. మరోవైపు వారిపై పడుతున్న ఆర్థిక భారాన్నీ మోస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లేటప్పుడు అక్కడ ఉండటానికి లిసిప్రియ తల్లి తన బంగారపు గొలుసును విక్రయించి మరీ హోటల్‌ సౌకర్యాన్ని అందించింది.

పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న లిసిప్రియకు చదువుకునే తీరిక ఉండటం లేదు. స్కూల్‌కు వెళ్ళాలి, తోటి పిల్లలతో కలిసి ఆడుకోవాలి అని ఉంటుంది. కానీ సమయం లేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూల్‌ మానేసింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూస్తే... నా మనసు ద్రవించిపోతుంది. దీనికంతా కారణం పర్యావరణ కాలుష్యమే. దీనిని నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది' అని చెప్పే లిసిప్రియను పర్యావరణ కార్యకర్తగా ప్రపంచమంతా పేరొందిన గ్రేటా తంబర్గ్‌తో పోల్చడం విశేషం. ఈమెను 'గ్రేటా ఆఫ్‌ ద గ్లోబల్‌ సౌత్‌'గా పిలుస్తున్నారు.

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 13 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0544: UK Johnson Dog No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4244586
UK PM's partner with their dog at election count
AP-APTN-0529: UK Scotland Sturgeon No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4244585
Sturgeon to UK PM: let Scotland choose its future
AP-APTN-0527: UK Election Scuffle AP Clients Only 4244584
Scuffles at UK election announcement
AP-APTN-0519: US House Impeachment Debate AP Clients Only 4244583
US House panel delays Trump impeachment vote
AP-APTN-0516: UK Johnson Profile News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive; AP Clients Only; No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4244023
UK PM Johnson's party secures majority in election
AP-APTN-0514: Asia Markets Part no access Japan; Part no archive 4244582
Asian stocks surge on US-China trade deal optimism
AP-APTN-0510: Australia NZ Victims No access Australia 4244581
Australia FM update on NZ volcano victims
AP-APTN-0501: Japan Forgotten Town AP Clients Only 4244580
ONLY ON AP Tokyo billed as 'Recovery Olympics'
AP-APTN-0459: India Opioids AP Clients Only 4244579
Opioid billed as 'safer' is widely abused
AP-APTN-0458: UK Scotland Election AP Clients Only 4244578
SNP celebrates good night in UK elections
AP-APTN-0452: UK Election Analyst AP Clients Only 4244577
Analyst on latest UK election results
AP-APTN-0450: UK Swinson Seat Part no use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4244574
Pro-EU Liberal Democrat leader loses UK seat
AP-APTN-0447: UK Johnson Departure No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4244576
UK PM leaves ruling party headquarters
AP-APTN-0442: India Assam Violence AP Clients Only 4244575
Police kill 2 protesters defying curfew in Assam
AP-APTN-0421: New Zealand Volcano Police No access New Zealand 4244573
Six bodies recovered from New Zealand volcano
AP-APTN-0410: UK Johnson Seat AP Clients Only 4244571
UK PM holds seat as ruling party vote surges
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.