ETV Bharat / bharat

ట్రక్కును ఢీ కొన్న అంబులెన్స్​-ఐదుగురు మృతి

author img

By

Published : Jan 26, 2021, 4:25 PM IST

ఉత్తర్​ప్రదేశ్ భదోహీలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును అంబులెన్స్​ ​ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డును పూర్తిగా మంచు కప్పేయటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

5-died-in-road-accident-in-bhadohi
ఆగి ఉన్న ట్రక్కును 'ఢీ' కొన్న అంబులెన్స్​-ఐదుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ భదోహీ జిల్లా గోపిగంజ్ ప్రాంతంలో ఆగి ఉన్న ట్రక్కును ఓ అంబులెన్స్​ ఢీకొన్నది. ఈ ఘటనలో అంబులెన్స్​లోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

కమ్మేసిన మంచు!

5-died-in-road-accident-in-bhadohi
ప్రమాదానికి గురైన అంబులెన్స్​

బంగాల్​ అసన్​సోల్ ​ నుంచి రాజస్థాన్​ చిత్తోర్​ఘడ్​కు అంబులెన్స్​ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్​లో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాద సమయంలో అంబులెన్స్ మితిమీరిన వేగంతో వెళుతోందని, దారిని పూర్తిగా మంచు కప్పేయటం వల్ల రోడ్డు పక్కన ఆపి ఉంచిన ట్రక్కును చూడకుండా ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి : చిత్రహింసలు పెట్టి దళిత మహిళపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.