ETV Bharat / bharat

నిర్భయ కేసులో మరో ట్విస్ట్​.. ఐసీజేను ఆశ్రయించిన దోషులు

author img

By

Published : Mar 16, 2020, 4:07 PM IST

Updated : Mar 16, 2020, 4:53 PM IST

2012 Delhi gang rape case
నిర్భయ కేసులో మరో ట్విస్ట్​.. ఐసీజేను ఆశ్రయించిన దోషులు

16:43 March 16

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ నెల 20న నలుగురు దోషులకు ఉరి అమలు నేపథ్యంలో.. శిక్ష తప్పించుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. తాజాగా ముగ్గురు దోషులు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

దిల్లీ కోర్టు తమకు విధించిన మరణ శిక్షపై స్టే విధించాలని.. ఐసీజేను కోరారు ముగ్గురు దోషులు అక్షయ్​ కుమార్​, వినయ్​, పవన్​ గుప్తా.  

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఇప్పటికే న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. క్యురేటివ్​, క్షమాభిక్ష పిటిషన్లను పునరుద్ధరించాలని కోరిన ముకేశ్​ పిటిషన్​నూ సుప్రీం కోర్టు ఇవాళ కొట్టివేసింది. ఈ నిర్ణయంతో వారికి శిక్ష తప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోయాయి. నలుగురూ ఒకేసారి ఉరికంబం ఎక్కనున్నారు.  

3 సార్లు వాయిదా..

నిర్భయ దోషులకు ఉరి శిక్ష మూడు సార్లు వాయిదా పడింది. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు దోషులను ఉరి తీయాలని దిల్లీ కోర్టు ఇటీవల డెత్​ వారెంట్​ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీహార్​ జైలులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 

16:03 March 16

నిర్భయ కేసులో మరో ట్విస్ట్​.. ఐసీజేను ఆశ్రయించిన దోషులు

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో మరో మలుపు తిరిగింది. తమ ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని ముగ్గురు దోషులు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నెల 20న నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో.. పవన్​, వినయ్​, అక్షయ్​ ఐసీజేను ఆశ్రయించారు. 

Last Updated : Mar 16, 2020, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.