ETV Bharat / bharat

నిర్భయ దోషి వినయ్​కు చుక్కెదురు- క్షమాభిక్షకు కోవింద్ నిరాకరణ

author img

By

Published : Feb 1, 2020, 10:38 AM IST

Updated : Feb 28, 2020, 6:13 PM IST

The apex court has granted bail to one of the accused, S Tiwari who was arrested in 2017 by the Gujarat Narcotics Bureau in Gujarat for allegedly possessing 1,445 kilograms of banned narcotic substances.

MERCY-PETETION
నిర్భయ దోషి వినయ్​కు చుక్కెదురు

10:36 February 01

నిర్భయ దోషి వినయ్​కు చుక్కెదురు- క్షమాభిక్షకు కోవింద్​ నిరాకరణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరి శిక్ష తప్పించుకునేందుకు తమకు ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నారు దోషులు. ఈ క్రమంలో రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నాడు దోషి వినయ్​ శర్మ. కానీ.. అక్కడా అతడికి నిరాశే ఎదురైంది. వినయ్​ క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరిస్తూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ నిర్ణయం తీసుకున్నారు. 

మరోమారు వాయిదా..

నిర్భయ కేసు దోషులను ఈ ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే... దిల్లీ కోర్టు శుక్రవారం సాయంత్రం స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు మిగిలే ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యే వరకు ఉరిని వాయిదా వేయాలని దోషులు కోరిన పిటిషన్​ విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఇదీ చూడండి: ఉరి తీసేవరకూ పోరాడుతా: నిర్భయ తల్లి

Last Updated : Feb 28, 2020, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.