ETV Bharat / bharat

శబరిమలలో అన్నదానం కోసం భారత్ బయోటెక్ ఎండీ విరాళం

author img

By

Published : Dec 8, 2021, 1:19 PM IST

Bharat Biotech MD: భారత్​ బయోటెక్​ ఎండీ డా. కృష్ణ ఎల్ల మంగళవారం.. సతీసమేతంగా శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం.. ఆయన అన్నదానం కార్యక్రమం కోసం ఆలయానికి రూ. కోటి విరాళం ప్రకటించారు.

Bharat Biotech MD
Bharat Biotech MD, భారత్​ బయోటెక్​ ఎండీ

Bharat Biotech MD: భారత్​ బయోటెక్​ ఎండీ డా. కృష్ణ ఎల్ల ఉదారత చాటుకున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే అన్నదానం కార్యక్రమం కోసం రూ. కోటి విరాళంగా ఇచ్చారు.

మంగళవారం డా. కృష్ణ, ఆయన భార్య సుచిత్ర కలిసి శబరిమల ఆలయాన్ని సందర్శించుకున్నారు. దర్శనం అనంతరం.. శబరిమల ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ వి. కృష్ణకుమార్​ వారియర్​కు నగదును ఆన్​లైన్​ ట్రాన్స్​ఫర్​ చేశారు.

Bharat Biotech MD, Sabarimala , Sabarimala temple
ఆలయ సందర్శనలో డా. కృష్ణ ఎల్ల దంపతులు

Sabarimala Annadanam: విరాళం ఇచ్చినందుకు ట్రావెన్​కోర్​ దేవస్వాం బోర్డు అధ్యక్షుడు అనంతగోపన్​ స్వయంగా.. కృష్ణ ఎల్లకు ఫోన్​ చేసి కృతజ్ఞతలు తెలిపారు.

శబరిమల అభివృద్ధికి, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు డా. కృష్ణ. దర్శన సమయంలో బోర్డు అధికారులు చాలా మంది.. కృష్ణ ఎల్ల వెంటే ఉన్నారు.

కొవాగ్జిన్​ సృష్టి..

Bharat Biotech Vaccine: కరోనా మహమ్మారికి దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండో టీకా కొవాగ్జిన్​. దీనిని అభివృద్ధి చేసిన భారత్​ బయోటెక్​ ఇంటర్నేషనల్​ ఎండీనే డా. కృష్ణ ఎల్ల.

కరోనా సవాళ్లు విసురుతున్న సమయంలో.. అత్యంత వేగంగా ఏడాది వ్యవధిలోనే దేశీయంగా వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అనంతరం.. పలు దేశాల్లోనూ ఈ టీకా వినియోగ అనుమతులు పొందింది. గత నెలలో ప్రపంచ గుర్తింపు పొందింది.

కొవాగ్జిన్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రకటించింది.

ఇవీ చూడండి: కొవాగ్జిన్​కు 'ప్రపంచ' గుర్తింపు- ఇక టీకా ఉత్పత్తి జోరు ​

రాత్రికి రాత్రే లక్షాధికారైన రైతుకూలీ- ఒక్క వజ్రంతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.