ETV Bharat / bharat

రాత్రికి రాత్రే లక్షాధికారైన రైతుకూలీ- ఒక్క వజ్రంతో...

author img

By

Published : Dec 8, 2021, 10:14 AM IST

Labourer finds diamond: రాత్రికి రాత్రే ఓ గిరిజన రైతుకూలీ లక్షాధికారిగా మారాడు. గనుల్లో పని చేసే అతనికి రూ.60లక్షలు విలువ చేసే ఓ వజ్రం(mine labourer finds diamond) దొరికింది. దీంతో అతను సంతోషంలో మునిగిపోయాడు.

Tribal labourer finds diamond
రైతుకూలీకి దొరికిన వజ్రం

Labourer finds diamond: ప్రపంచంలోకెల్లా ఆకర్షణీయమైన, నాణ్యమైన వజ్రాలు దొరికే మధ్యప్రదేశ్ రాష్ట్ర పన్నా గనుల్లో గిరిజన రైతుకూలీ ములాయం సింగ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కృష్ణ కల్యాణ్​పుర్ పట్టి గనిలో కార్మికులు జరుపుతున్న తవ్వకాల్లో రూ.60లక్షలు విలువ చేసే 13.54 క్యారెట్ల వజ్రాయం ములాయం చేతికి చిక్కింది. దీంతోపాటే మరో ఆరు చిన్న వజ్రాలు ములాయంతోపాటు తవ్వకాలు జరుపుతున్న సహ కార్మికులకు దొరికాయి.

Panna diamond mines: ఒకేరోజు దొరికిన ఈ 7 వజ్రాల విలువ దాదాపు రూ.కోటి ఉంటుందని అంచనా. పన్నా గనులకు ఇది 'డైమండ్ డే' అని అధికారులు తెలిపారు. వేలంలో వీటి అసలు విలువ తెలుస్తుంది. ఈ డబ్బుతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటానని ములాయం చెప్పారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.