ETV Bharat / bharat

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు.. అర్హ‌త, దరఖాస్తు వివరాలు ఇవిగో..

author img

By

Published : May 9, 2023, 9:39 AM IST

Bank of Baroda job notification 2023 : మ‌న దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన​ 'బ్యాంక్ ఆఫ్ బ‌రోడా'లో ప‌లు పోస్టుల కోసం నోటిఫికేష‌న్ రిలీజైంది. ఆ పోస్టులేంటి, అభ్య‌ర్థుల విద్యార్హ‌త‌లు, దరఖాస్తు విధానం వివ‌రాలు మీ కోసం..

bank of baroda recruitment 2023
bank of baroda recruitment 2023

Bank of Baroda Recruitment 2023 : బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న వారికి గుడ్​న్యూస్​. కొంచెం దృష్టి పెట్టి, సీరియ‌స్ గా సన్న‌ద్ధ‌మ‌వుతే.. బ్యాంకు కొలువు మీదే. దేశంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త‌ర్వాత బ్యాంక్ ఆఫ్ బ‌రోడాది రెండో స్థానం. గుజ‌రాత్​లోని వ‌డోద‌ర ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న ఈ బ్యాంకులో ఖాళీగా ఉన్న 157 మేనేజ‌ర్, ఇత‌ర పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఆ వివ‌రాల్ని త‌మ అధికారిక వెబ్​సైట్​లో పెట్టింది.

Bank of Baroda job vacancy 2023 : ఆ వివ‌రాల ప్ర‌కారం.. మొత్తం 157 ఖాళీలున్నాయి. అందులో రిలేష‌న్ షిప్ మేనేజ‌ర్‌, క్రెడిట్ అన‌లిస్టు, ఫోరెక్స్ అక్విజిష‌న్‌ అండ్ రిలేష‌న్ షిప్ మేనేజ‌ర్ పోస్టులున్నాయి. ఇందులో రిలేష‌న్ షిప్ మేనేజ‌ర్ - 66, క్రెడిట్ అన‌లిస్టు - 74, ఫోరెక్స్ అక్విజిష‌న్‌ అండ్ రిలేష‌న్ షిప్ మేనేజ‌ర్ - 17 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు ఈ నెల 17 వ‌ర‌కు ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

అభ్య‌ర్థుల అర్హత విష‌యానికొస్తే.. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేష‌న్‌, పోస్టు గ్రాడ్యుయేష‌న్, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక పోస్టుల పరంగా చూస్తే.. రిలేష‌న్​షిప్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌ లేదా పోస్టు గ్రాడ్యుయేష‌న్, ఫైనాన్స్ (ఏడాది కోర్సు)లో స్పెష‌లైజేష‌న్ ఉండాలి.

క్రెడిట్ అన‌లిస్టు పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేష‌న్, పోస్టు గ్రాడ్యుయేష‌న్, ఫైనాన్స్​లో స్పెష‌లైజేష‌న్ ఉండాలి. లేదా సీఏ, సీఎమ్ఏ, సీఎస్‌, సీఎఫ్ఏ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫోరెక్స్ అక్విజిష‌న్‌ అండ్ రిలేష‌న్​షిప్ మేనేజ‌ర్ పోస్టుల‌కు గానూ.. ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌ లేదా పోస్టు గ్రాడ్యుయేష‌న్ లేదా మార్కెటింగ్, సేల్స్​లో డిప్లొమా ఉండాలి.

ఎంపిక విధానం : ఎంఎంజీ/ ఎస్-2, ఎంఎంజీ/ ఎస్-3 స్థానాలకు మాత్ర‌మే ప‌రీక్ష ఆన్​లైన్​లో ఉంటుంది. మిగిలిన‌ వాటికి సైకోమెట్రిక్, ఇత‌ర పరీక్షలు ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఉంటాయి. అప్లికేష‌న్ల ద‌ర‌ఖాస్తు, ఫీజు పేమెంట్ చివ‌రి తేదీ మే 17. మ‌రింత స‌మాచారం కోసం బ్యాంకు అధికారిక వైబ్ సైట్ www.bankofbaroda.in ని సంద‌ర్శించి నోటిఫికేష‌న్ చదవండి.

UIDAI Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్ చెప్పింది సర్కార్​. 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ' (యూఐడీఏఐ)- ఆధార్​ సంస్థలో పనిచేయాలని కోరుకునే వారి కోసం ఉద్యోగాల​ నోటిఫికేషన్​ను ఇటీవలే విడుదల చేసింది. దిల్లీలోని UIDAI ప్రాంతీయ కార్యాలయంలోని వివిధ పోస్టులకు డిప్యుటేషన్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి : ఆ రాష్ట్రంలో భారీగా లిథియం నిక్షేపాలు.. కశ్మీర్​ కంటే అధికం!

'వారంతా కచ్చితంగా JIO సిమ్​ వాడాల్సిందే'.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.