ETV Bharat / bharat

గ్రౌండ్​ ఫ్లోర్​లో బాల 'రాముడు'- అయోధ్యలో శబరికి ప్రత్యేక ఆలయం, దర్శనానికి కోటి మంది భక్తులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 10:42 AM IST

Ayodhya Ram Mandir Specialities : అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా పండుగలా జరుపుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ పిలుపునిచ్చింది. ఆరోజు సాయంత్రం ఇళ్ల మందు దీపాలను వెలిగించాలని కోరింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించింది.

Trust issued letter Ramlala will sit on ground floor Ram Darbar will be decorated on first floor
Trust issued letter Ramlala will sit on ground floor Ram Darbar will be decorated on first floor

Ayodhya Ram Mandir Specialities : ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ భక్తులకు సుదీర్ఘ సందేశాన్ని ఇచ్చింది. ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. రామ మందిర నిర్మాణానికి సంబంధించిన పూర్తి విషయాలను షేర్​ చేసింది.

  • जय श्री राम!
    Jai Shri Ram!

    संपूर्ण विश्व के श्रीराम भक्तों से हमारा निवेदन

    Our appeal to Shri Ram bhakts across globe. pic.twitter.com/adpw7EO62A

    — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

392 స్తంభాలు.. 44 తలుపులు
Ayodhya Ram Mandir Construction Video : అయోధ్యలో నూతన రామ మందిర నిర్మాణం సంప్రదాయ నగర శైలిలో జరిగినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. తూర్పు నుంచి పడమరకు 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఆలయ నిర్మాణం జరిగినట్లు చెప్పింది. మొత్తం ఆలయ సముదాయంలో 392 స్తంభాలు, 44 తలుపులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Ayodhya Ram Mandir Specialities
రామ మందిర తలుపులు

గ్రౌండ్​ ఫ్లోర్​లో రామయ్య.. మొదటి అంతస్తులో రామ్​ దర్బార్​
Ayodhya Ram Mandir Construction Design : శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివరాల ప్రకారం.. రామ మందిరం గ్రౌండ్​ ఫ్లోర్​లో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. మొదటి అంతస్తులో శ్రీరాముడు.. సీతాలక్ష్మణహనుమంతుడి సహితంగా దర్శమనిస్తారు. ఆలయ స్తంభాలు, గోడలపై బ్రహ్మాదిదేవతల విగ్రహాలను చెక్కారు. తూర్పు నుంచి 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి చేరుకోవచ్చు. ఆలయం ప్రాంగణంలో మొత్తం ఐదు మండపాల నిర్మాణం జరిగింది. అవి నృత్య మండపం, రంగ మండపం, ప్రార్థనా మండపం, కీర్తనా మండపం, సభా మండపం.

Ayodhya Ram Mandir Specialities
బాల రాముడి విగ్రహ నమూనా

దివ్యాంగులు, వృద్ధులకు లిఫ్ట్​ సదుపాయం
Ram Mandir Ayodhya New Design : రామ మందిరంలో దివ్యాంగులు, వృద్ధులకు లిఫ్ట్​ను ఏర్పాటు చేయనున్నారు. ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 4.25 మీటర్ల వెడల్పుతో దీర్ఘచతురస్రాకార గోడను నిర్మించారు. సూర్యభగవానుడు, శివుడు, గణపతి, భగవతి దేవీ ఆలయాలను నాలుగు మూలల్లో నిర్మించారు. ఉత్తరాన అన్నపూర్ణ మాత.. దక్షిణాన హనుమంతుడి ఆలయాలను ప్రతిష్ఠించనున్నారు.

  • Carvings inside Shri Ram Janmabhoomi Mandir.

    श्री राम जन्मभूमि मंदिर के भीतर नक्काशी का कार्य pic.twitter.com/sFfUbWLBHv

    — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరిన్ని ఆలయాలు..
Ayodhya Ram Mandir Decoration : వీటితో పాటు ఆలయ ప్రాంగణంలో వాల్మీకి మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, శబరి, అహల్య ఆలయాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆలయం ప్రాంగణంలోని నవరత్న కుబేరుడి గుట్టపై శివాలయాన్ని పునురుద్ధరించనున్నారు. జటాయు విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

భజనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి..
Ayodhya Ram Mandir Inauguration Time : 2024 జనవరి 22వ తేదీ పుష్య ద్వాదశి నాడు శ్రీరాముడి బాల రూపాన్ని నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో ప్రతిష్ఠంచనున్నారు. ఆ రోజు ప్రతీ గ్రామం, ప్రాంతం, కాలనీలో ఉన్న దేవాలయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2వరకు భజన కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరింది. పెద్ద స్క్రీన్​లు ఏర్పాటు చేసి రామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని చెప్పింది. ప్రసాద వితరణ చేయాలని కోరింది.

108 సార్లు రామ జపం.. సాయంత్రం ఇంటి ముందు దీపం
Ram Mandir In Ayodhya Latest News : జనవరి 22వ తేదీన అన్ని ఆలయాల్లో దేవుళ్లకు కీర్తించి, పూజ చేసి హారతి ఇవ్వాలని కోరింది. శ్రీ రామ్ జై రామ్.. జై జై రామ్ అంటూ 108 సార్లు జపించాలని సూచించింది. హనుమాన్ చాలీసా, సుందరాకాండ, రామరక్షా స్తోత్రం మొదలైన వాటిని సామూహికంగా పారాయణం చేయవచ్చని చెప్పింది. అదే రోజు సాయంత్రం.. సూర్యాస్తమయం తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు దీపం వెలిగించాలని అభ్యర్థించింది. కోట్లాది ఇళ్లలో దీపోత్సవం జరగాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆలయ ప్రతిష్ఠ తర్వాత కుటుంబసమేతంగా అయోధ్య రామయ్యను దర్శించకోవాలని పిలుపునిచ్చింది.

కోటి మందికిపైగా..
మరోవైపు, రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత 50 రోజులలోపు కోటి మందికి పైగా ప్రజలు అయోధ్యను సందర్శిస్తారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ తెలిపారు. వారణాసిలో నిర్వహించిన సంస్కృతి సంసద్‌కు హాజరైన ఆయన.. ఈటీవీ భారత్​తో ఈ విషయాన్ని చెప్పారు.

అయోధ్య రామ మందిరం గురించి ఈటీవీ భారత్​ అందించిన కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.