ETV Bharat / bharat

Ayodhya Ram Mandir Opening Date : జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ!.. మోదీ హాజరు

author img

By PTI

Published : Sep 26, 2023, 10:58 PM IST

Ayodhya Ram Mandir Opening Date : అయోధ్య రామమందిరంలో మొదటి అంతస్థు నిర్మాణ పనులు.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని చెప్పారు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 తేదీల మధ్య రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే అవకాశం ఉందని ప్రకటించారు.

Ayodhya Ram Mandir Opening Date
Ayodhya Ram Mandir Opening Date

Ayodhya Ram Mandir Opening Date : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ పనులు... డిసెంబరు చివరి కల్లా పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 తేదీల మధ్య రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని చెప్పారు. అయితే, ప్రధాని మోదీ ఏ రోజున స్వామివారి సేవలో పాల్గొంటారన్న అంశంపై.. ప్రధానమంత్రి కార్యాలయం(PMO) స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

  • VIDEO | "The administration has enhanced security for the Prime Minister, who is scheduled to visit Ayodhya for the consecration ceremony. I would like to appeal to everyone not to visit Ayodhya during this time. It would be better for them to plan their visit in February," says… pic.twitter.com/EI5qDcrgZQ

    — Press Trust of India (@PTI_News) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాముడిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు
Ayodhya Ram Mandir Inauguration : మరోవైపు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఆలయ గర్భగుడిలోని రాముడి నుదిటిపై సూర్యకిరణాలు పడేలా ఆలయ శిఖరంపై ఒక ఉపకరణాన్ని పెడతామని వివరించారు. ఆ ఉపకరణానికి సంబంధించిన డిజైన్‌ పనులు బెంగళూరులో శాస్త్రవేత్తలు పర్యవేక్షణలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆలయ నిర్మాణం కోసం రూ. 900 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. జనవరిలో జరిగే ప్రారంభోత్సవానికి 10 వేల మందిని ఆహ్వానించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక జాబితా తయారీ తుది దశలో ఉన్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణె, రూర్కీలోని సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంయుక్తంగా అందిస్తోందని ఆయన తెలిపారు.

Ayodhya Ram Mandir Construction Update : సుమారు వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు నృపేంద్ర మిశ్రా. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సాధువులు, పూజారులు సలహాల మేరకు చేపడతామని తెలిపారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. వీలైనంత వరకు భక్తులు ఇంట్లోనే ఉండి టీవీల్లో ఈ కార్యక్రమానని చూడాలని సూచించారు. భక్తులు కేవలం 15-20 సెకన్లు మాత్రమే రాముడ్ని చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆలయ నిర్మాణంలో ఇనుము ఎక్కడా ఉపయోగించలేదని.. రాళ్లను కలపడానికి రాగిని వినియోగించామని వివరించారు.

Ayodhya Ram Mandir Opening : వేలాది మంది సాధువుల మధ్య అయోధ్య రామ మందిరం ఓపెనింగ్​.. నటీనటులు, ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానం..

అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు మోదీకి ఆహ్వానం.. అట్టహాసంగా కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.