ETV Bharat / bharat

అయోధ్య రామాలయంలో పూజారుల పోస్టులకు సెలక్షన్​- ఎన్ని వేల మంది అప్లై చేశారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 1:07 PM IST

Ayodhya Priest Vacancy
Ayodhya Priest Vacancy

Ayodhya Priest Vacancy : అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో పూజలు చేసేందుకు యువ అర్చకులను ఎంపిక చేసే పని ప్రారంభించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. 20 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. 3వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులందరికీ రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి, అర్హులను ఎంపిక చేస్తోంది ఆలయ ట్రస్ట్.

అయోధ్య రామాలయంలో పూజారుల పోస్టులకు సెలక్షన్​- ఎన్ని వేల మంది అప్లై చేశారంటే?

Ayodhya Priest Vacancy : అయోధ్య రామ మందిరంలో విధులు నిర్వర్తించే అర్చకుల నియామక ప్రక్రియ జోరుగా సాగుతోంది. వేదాలు, సంబంధిత పూజా కార్యక్రమాలపై పట్టున్నవారిని ఇందుకోసం ఎంపిక చేసే పనిలో ఉంది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.

గుడిలో వివిధ పూజలు చేసేందుకు 20 నుంచి 30ఏళ్ల మధ్య వయసు ఉన్న 20 మంది అర్చకుల్ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపింది ఆలయ ట్రస్ట్. 20 పోస్టుల కోసం 3వేల మందికిపై అర్చకులు దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తున్నారు.

Ayodhya Priest Vacancy
అయోధ్య రామాలయంలో పూజారుల పోస్టులకు అప్లై చేసుకునేందుకు వచ్చిన అర్చకులు

"మేము 20 మంది అర్చకుల్ని ఎంపిక చేస్తున్నాం. వీరికి ఉచితంగా 6 నెలలపాటు శిక్షణ ఇస్తాం. వారికి ఆ సమయంలో బస సౌకర్యం కల్పిస్తాం. శిక్షణ సమయంలో స్టైపెండ్​ కూడా ఇస్తాం."
--డాక్టర్ అనిల్ మిశ్రా, రామాలయం ట్రస్ట్ సభ్యుడు

అయోధ్య రామాలయంలో అర్చకులుగా సేవలు అందించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నామని చెబుతున్నారు యువకులు.

Ayodhya Priest Vacancy
అయోధ్య రామాలయంలో పూజారుల పోస్టులకు అప్లై చేసుకునేందుకు వచ్చిన అర్చకులు

"వేదాలు, ఆగమ శాస్త్రం, సంధ్య విధి వంటి అర్చక సంబంధిత విషయాలపై ఇంటర్వ్యూలో మమ్మల్ని ప్రశ్నలు అడిగారు. నాకు తెలిసినవి అన్నీ చెప్పాను. రాముడికి సేవ చేసే అవకాశం లభిస్తే అదొక గొప్ప అదృష్టం. రాముడికి సేవ చేసే అవకాశం వస్తే జీవితంలో సఫలమైనట్టే."
--అతులిత్ పాండే, దరఖాస్తుదారుడు

"మేము ఇక్కడకు ఓ ప్రత్యేకమైన పనిపై వచ్చాం. అర్చకులకు శిక్షణ ఇచ్చేవారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. ముఖ్యంగా 'సంధ్య' గురించి అడిగారు. సంబంధిత మంత్రాలపై ప్రశ్నించారు. రామ స్తోత్రాల గురించి అడిగారు. వ్యాకరణంపై పట్టున్న అర్చకుల్ని.. సంబంధిత ప్రశ్నలు అడిగారు."
--గిర్ధారీ లాల్ మిశ్రా, ఎంపికైన అర్చకుడు

అయోధ్య రామాలయంలో వచ్చే ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది సాధువులకు ఆహ్వానం అందింది. మృగశిర నక్షత్రంలో అభిజిత్​ ముహుర్తంలో ఈ మహత్తర కార్యక్రమం చేపట్టనున్నారు. రామ్​లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు సంఘ్​ పరివార్​ ప్రణాళికలు రచిస్తోంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

45రోజుల్లో రామమందిర నిర్మాణం పూర్తి- స్పెషల్​​ లైట్స్​తో డెకరేషన్​- ఆలయమంతా బంగారు వర్ణమే!

22లక్షల దీపాల వెలుగులో అయోధ్య- ఉజ్జయిని రికార్డు బ్రేక్​, గిన్నిస్​లో చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.