ETV Bharat / bharat

45రోజుల్లో రామమందిర నిర్మాణం పూర్తి- స్పెషల్​​ లైట్స్​తో డెకరేషన్​- ఆలయమంతా బంగారు వర్ణమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 8:45 AM IST

Ayodhya Ram Mandir Construction Status : అయోధ్యలోని భవ్య రామమందిరం నిర్మాణపనులు చకచకా జరుగుతున్నాయి. 45రోజుల్లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆలయం మొత్తం పసిడి కాంతులతో మెరిసిపోయే విధంగా ప్రత్యేక విద్యుత్​ దీపాలను అలంకరిస్తున్నారు.

Ayodhya Ram Mandir Construction Status
Ayodhya Ram Mandir Construction Status

Ayodhya Ram Mandir Construction Status : ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య రామమందిర నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. నూతనంగా నిర్మిస్తున్న రామమందిరంలో జనవరి 22న రామ్​లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో ఛైర్మన్​ నృపేంద్ర మిశ్రా.. 45 రోజుల్లోగా మొత్తం పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 15వ తేదీలోగా గ్రౌండ్​ ఫ్లోర్ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలను ఎల్​ అండ్ టీ రూపొందించిందని నిర్వాహకులు తెలిపారు.

Ayodhya Ram Mandir Construction Status
అయోధ్యలోని సీతారాములు

"2024 జనవరి 22వ తేదీన రామ్​లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకు వీలైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ విషయంలో పనులు త్వరగా పూర్తిచేయాలని ఎల్​ అండ్​ టీపై ఒత్తిడి ఉంది. గ్రౌండ్​ ప్లోర్ పనులు చివరి దశలో ఉన్నాయి. డిసెంబర్​ నాటికి పూర్తవుతాయి. ప్రస్తుతం స్తంభాలపైన శిల్పకళాకృతులు చెక్కుతున్నారు. ఆలయంలోని నృత్య మండపం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రంగమండపాన్ని డిసెంబర్​ నాటికల్లా నిర్మిస్తాం."

-- వినోద్ మెహతా, ఎల్​ అండ్​ టీ ప్రాజెక్ట్ మేనేజర్

'పసిడి కాంతులతో మెరిసిపోనున్న ఆలయం'
ఆలయమంతా పసుపురంగు విద్యుత్​ దీపాలతో అలంకరిస్తున్నట్లు ఎల్​ అండ్​ టీ ప్రాజెక్ట్​ మేనేజర్​ వినోద్​ మెహతా తెలిపారు. రెండు రకాల లైట్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. వాల్వాస్ లైట్ల కాంతి నేరుగా.. స్తంభాలపై చెక్కిన శిల్పాలపై పడేటట్లు అమరుస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ పైకప్పుపై లైటింగ్​ అమర్చడం పూర్తయిందని చెప్పారు. విద్యుత్​ దీపాల అలంకరణ పనులన్నీ పూర్తయితే ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుందని పేర్కొన్నారు.

అయోధ్య రామమందిర నిర్మాణ పనుల దృశ్యాలు

విగ్రహప్రతిష్టాపనకు 25వేల మంది అతిథులకు ఆహ్వానం!
Ayodhya Ram Mandir Opening Date : వచ్చే సంవత్సరం జనవరి 21 నుంచి 23 వరకు జరగనున్న రాముడి విగ్రహప్రతిష్టాపనకు శ్రీరామ జన్మభూమి ట్రస్టు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తం 25 వేల మందిని ఈ కార్యక్రమాలకు ఆహ్వనించనున్నట్లు ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే వారణాసి నుంచి అయోధ్యకు అర్చకులు వచ్చినట్లు తెలిసింది.

Ayodhya Ram Mandir Construction Status
జరుగుతున్న రామమందిర నిర్మాణపనులు

జనవరిలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ!.. హోటళ్లు, రిసార్ట్​లు హౌస్​ఫుల్​..

శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం.. ముస్లింలు సైతం భాగమై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.