ETV Bharat / bharat

అరుణాచల్​లో మరో 15 ప్రాంతాలకు చైనా నామకరణం!

author img

By

Published : Dec 30, 2021, 7:35 PM IST

arunachal pradesh china, అరుణాచల్​ ప్రదేశ్ చైనా
అరుణాచల్​లో మరో 15 ప్రాంతాలకు చైనా పేర్లు

Arunachal Pradesh China: చైనా మరోమారు దందుడుకు చర్యకు పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్​లో 15 ప్రాంతాలకు అధికారిక చైనీస్ పేర్లు పెడుతున్నట్లు ప్రకటించింది. గ్లోబల్​ టైమ్స్​ ఈమేరకు కథనం ప్రచురించింది.

Arunachal pradesh china: అరుణాచల్​ ప్రదేశ్​లో మరో 15 ప్రాంతాలకు మరింత ప్రామాణికమైన అధికారిక చైనీస్​ పేర్లు పెడుతున్నట్లు చైనా బుధవారం ప్రకటించింది. భారత ఈశాన్య రాష్ట్రమైన ఈ ప్రాంతం తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తోంది డ్రాగన్​ దేశం. ఇప్పటికే అరుణాచల్​ ప్రదేశ్​ను 'జన్​గ్నాన్​' అని చైనీస్​ పేరుతోనే పిలుస్తోంది. ఆ రాష్ట్రంలో మరో 15 ప్రాంతాలకు చైనీస్​, టిబెటన్, రోమన్ ఆల్పబెట్​లతో అధికారిక పేర్లు పెట్టినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. చైనా పౌర వ్యవహారాల శాఖ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసినట్లు చెప్పింది.

ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలు కాగా.. 4 పర్వతాలు, రెండు నదులు, ఓ పర్వత మార్గం ఉన్నాయి.

అరుణాచల్​ ప్రదేశ్​లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది రెండోసారి. 2017లో కూడా ఇలాగే ఆరు ప్రాంతాలకు తమ అధికారిక పేర్లు పెట్టింది.

అరుణాచల్ ప్రదేశ్​ దక్షిణ టిబెట్​లో భాగమని వాదిస్తోంది చైనా. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. అది భారత్​లో అంతర్భాగమని తేల్చి చెప్పింది. అరుణాచల్​లో భారత నాయకులు పర్యటించిన ప్రతిసారి చైనా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. అది తమ భూభాగమని వితండవాదం చేస్తోంది.

చైనా కొత్తగా పేరు పెట్టిన 15 ప్రాంతాల్లో 8 నివాసిత ప్రాంతాలను స్నగ్​కెజాంగ్​, దగ్లుంగ్​ జాంగ్​, మనిగాంగ్​, డుడింగ్, న్యింగ్​చి, గోలింగ్​, డంబా, మెజాగ్​గా చెబుతోంది. నాలుగు పర్వతాలకు వామో రి, డు రి, లన్​జుబ్​ రి, కున్​మింగ్​జింగ్​ ఫెంగ్​ అని నామకరణం చేసింది. అలాగే రెండు నదులకు జెన్​యోగ్మో, దులైన్​ అని.. పర్వత మార్గాన్ని 'సె లా' అని పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ ఈ వివరాలను వెల్లడించింది.

India China border dispute

భారత్ చైనా సరిహద్దులో 3,488కి.మీ వాస్తవాధీన రేఖ వివాదాస్పదంగా ఉంది.

ఇదీ చదవండి: రఫేల్​కు పోటీగా చైనా జెట్​లు కొన్న పాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.