ETV Bharat / bharat

Antonio Guterres India : 'భారత్​ 'విశ్వ దేశం'.. కానీ..' ఐరాసలో శాశ్వత సభ్యత్వంపై గుటెరస్ కీలక వ్యాఖ్యలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 9:04 PM IST

Updated : Sep 8, 2023, 10:26 PM IST

Antonio Guterres India Visit
Antonio Guterres India Visit

Antonio Guterres India UNSC Permanent Seat : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వంపై నిర్ణయం తీసుకోవాల్సింది తాను కాదని.. సభ్యులనేని UN సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా బహుపాక్షిక వ్యవస్థలో సంస్కరణలు అవసరమని తాను విశ్వాసిస్తున్నట్లు చెప్పారు.

Antonio Guterres India UNSC Permanent Seat : బహుపాక్షిక వ్యవస్థలో భారత్​ను చాలా ముఖ్యమైన భాగస్వామిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​​ అభివర్ణించారు. భారత్‌ను 'విశ్వ దేశం'గా ఆయన పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్​ సభ్యత్వంపైనా స్పందించారు. ఈ విషయంలో నిర్ణయం తమ చేతుల్లో ఏమీలేదని.. సభ్యదేశాలే తుది నిర్ణయం తీసుకుంటాయన్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు దిల్లీ చేరుకున్న గుటెరస్​.. ఐరాస భద్రతా మండలిలో భారత్‌ చేరేందుకు సమయం ఆసన్నమైందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.

'భారత్‌.. విశ్వదేశమని చెప్పడంలో అతిశయోక్తి లేదు'
Antonio Guterres India Visit : "ఐరాస భద్రతా మండలిలో ఎవరు ఉండాలన్నది నా నిర్ణయం కాదు. సభ్యదేశాలే దానిపై నిర్ణయం తీసుకుంటాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్‌.. విశ్వదేశమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బహుపాక్షిక వ్యవస్థలో భారత్‌ అతిముఖ్యమైన భాగస్వామి. నేటి ప్రపంచంలో బహుపాక్షిక వ్యవస్థను ప్రతిబింబించేలా సంస్కరణలు అవసరమని విశ్వసిస్తున్నా" అని ఐరాస చీఫ్‌ ఆంటోనియా గుటెరస్‌ పేర్కొన్నారు. అయితే, ఈ సంస్కరణలకు ఏమైనా కాలక్రమం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. వాటిని చేయాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు.

'ఒక కుటుంబం, ఒక భూమి, ఒక భవిష్యత్తు అనే నినాదం..'
జీ20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించడం ప్రపంచానికి ఎంతో అవసరమైన పరివర్తనాత్మక మార్పునకు దారితీస్తుందని గుటెరస్​​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక కుటుంబం, ఒక భూమి, ఒక భవిష్యత్తు అనే నినాదం మహా ఉపనిషత్తు నుంచి ప్రేరణ పొందిందని ఆయన గుర్తు చేశారు. జీ20 దేశాలు వాతావరణం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని సాధించడంలో నాయకత్వాన్ని ప్రదర్శించాలని గుటెరస్ అన్నారు. 80 శాతం ప్రపంచ ఉద్గారాలకు జీ20 దేశాలే కారణమవుతున్నందున.. వాటిని తగ్గించడంలో ముందుండాలని సూచించారు.

'ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలి'
"ప్రపంచంలో పేదరికం, ఆకలి బాధలు, అసమానతలు పెరుగుతున్నాయి. కానీ ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి సంఘీభావం లేదు. ఉమ్మడి మేలు కోసం అంతా కలిసి రావాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జీ20 సభ్యుల నియంత్రణలో ఉన్నందున సవాళ్లను పరిష్కరించడానికి అంతా కలిసి పనిచేయాలి" అని ఆయన కోరారు.

రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంపై గుటెరస్​ కీలక వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భవిష్యత్తులో శాంతి పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం తనకు లేదని గుటెర్రెస్ అన్నారు. రెండు దేశాల మధ్య విభేదాలు ఇంకా సమసిపోయేలా కనిపించడం లేదని అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి భారతదేశం మధ్యవర్తిత్వం వహించగలదా అని అడిగ్గా.. మధ్యవర్తిత్వం చేయొచొచ్చని, కానీ శాంతి పరిష్కారం లభిస్తుందనన్న నమ్మకం తనకు లేదనిచెప్పారు.

'తప్పు చేస్తోన్న రష్యా.. బలయ్యేది అమాయక ప్రజలే'

'ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ'

Last Updated :Sep 8, 2023, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.