ETV Bharat / bharat

'సిద్ధూకు మంత్రి పదవి కోసం పాక్​ ప్రధాని లాబీయింగ్​!'

author img

By

Published : Jan 24, 2022, 5:56 PM IST

Pakistan wanted Sidhu reinstated as Punjab minister
సిద్ధూకు మంత్రి పదవి కోసం పాక్​ ప్రధాని లాబీయింగ్​!

Amarinder Singh vs Navjot Singh Sidhu: పంజాబ్​ రాజకీయాల్లో కెప్టెన్​ అమరీందర్​ సింగ్​, నవజ్యోత్​ సింగ్​ సిద్ధూల మధ్య వివాదం అప్పట్లో సంచలనంగా మారింది. సొంత పార్టీపైనే విమర్శలు చేసిన ​ సిద్ధూను మంత్రి పదవి నుంచి తొలగించారు కెప్టెన్​. ఆ తర్వాత సిద్ధూకు మంత్రి పదవి కోసం పాకిస్థాన్​ ప్రధానమంత్రి లాబీయింగ్​ చేశారా? కెప్టెన్​తో మంతనాలు జరిపారా? తాజాగా అమరీందర్​ చేసిన వ్యాఖ్యలు ఏం చెబుతున్నాయి?

Amarinder Singh vs Navjot Singh Sidhu: పంజాబ్​ రాజకీయాల్లో కొద్ది రోజుల క్రితం సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ సంచలనంగా మారారు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ. అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​తో విబేధాలతో పార్టీలో సంక్షోభం తలెత్తింది. సిద్ధూను మంత్రి పదవి నుంచి తొలగించారు కెప్టెన్​. ఈ క్రమంలో సిద్ధూను మళ్లీ మంత్రి పదవిలోకి తీసుకోవటంపై పాకిస్థాన్​ ప్రధాని లాబీయింగ్​ చేసినట్లు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు అమరీందర్​​.

పంజాబ్​ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమితో సీట్ల పంపకంపై దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో సమావేశమైన అనంతరం.. విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సింగ్​. సీఎంగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధూను తిరిగి మంత్రి పదవిలోకి తీసుకోవాలని పాక్​ ప్రధాని నుంచి సందేశం వచ్చినట్లు చెప్పారు.

" నా ప్రభుత్వం నుంచి సిద్ధూను తొలగించిన తర్వాత.. పాకిస్థాన్​ ప్రధానికి ఆయన పాత స్నేహితుడని ఆ దేశం నుంచి నాకు ఒక సందేశం వచ్చింది. సిద్ధూను తన ప్రభుత్వంలోకి తిరిగి తీసుకుంటే కృతజ్ఞతతో ఉంటారని.. ఒకవేళ సరైన పనితీరు కనబరచకపోతే అప్పుడు తొలగించాలని అందులో ఉంది."

- కెప్టెన్​ అమరీందర్​ సింగ్​, పీఎల్​సీ పార్టీ అధినేత.

పంజాబ్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రి వర్గం నుంచి సిద్ధూను తొలిగించారు కెప్టెన్​. ఆ తర్వాత పంజాబ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడిగా సిద్ధూను నియమించటాన్నీ వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'సిద్ధూకు పాక్​తో సంబంధాలు.. సీఎంను చేస్తే దేశానికే ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.