ETV Bharat / bharat

బాబ్రీ కేసు తీర్పుపై నేడు అలహాబాద్​ హైకోర్టులో విచారణ

author img

By

Published : Jan 13, 2021, 5:31 AM IST

బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని బుధవారం విచారించనుంది అలహాబాద్​ హైకోర్టు. అయోధ్య వాసులు హాజీ మహ్‌మూద్‌ అహ్మద్‌, సయ్యద్‌ అఖ్లాఖ్‌ అహ్మద్‌ ఈ పిటిషన్​ దాఖలు చేశారు. ఆల్‌ ఇండియా ముస్లి పర్సనల్‌ లా బోర్డు సభ్యుడు జఫార్యద్‌ జిలానీ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించనున్నారు.

Allahabad High Court to hear plea against acquittal of Babri mosque demolition accused
బాబ్రీ కేసు తీర్పుపై నేడు అలహాబాద్​ హైకోర్టులో విచారణ

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించడంపై దాఖలైన వ్యాజ్యాన్ని అలహాబాద్‌ హైకోర్టు బుధవారం విచారించనుంది. అయోధ్య వాసులు హాజీ మహ్‌మూద్‌ అహ్మద్‌, సయ్యద్‌ అఖ్లాఖ్‌ అహ్మద్‌ గతేడాది సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ నెల 8న పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో పిటిషనర్ల తరపున ఆల్‌ ఇండియా ముస్లి పర్సనల్‌ లా బోర్డు సభ్యుడు జఫార్యద్‌ జిలానీ వాదనలు వినిపించనున్నారు.

ఇదీ చూడండి: స్వామి హర్షానంద అస్తమయం.. మోదీ దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.