ETV Bharat / bharat

'భర్తకు భార్య భరణం ఇవ్వాల్సిందే'.. విడాకుల కేసులో హైకోర్టు తీర్పు

author img

By

Published : Mar 31, 2022, 3:56 PM IST

woman to pay alimony to husband: భార్యాభర్తలు విడిపోయినప్పుడు భార్యకు భర్త భరణం ఇవ్వడం సాధారణమే. అయితే, ఈ విషయంలో బొంబాయి హైకోర్టు ఔరంగాబాద్​ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. ఓ కేసులో భర్తకు భార్య భరణం ఇవ్వాలని స్పష్టం చేసింది. దిగువ కోర్టు ఈమేరకు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

alimony-to-husband
భరణం

woman to pay alimony to husband: వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్యాభర్తలు వీడిపోయిన సందర్భంలో భార్యకు భరణం ఇవ్వటం చాలా ఏళ్ల నుంచి వస్తున్న పద్ధతి. అయితే, వీడాకులు తీసుకునే భార్య.. భర్తకు భరణం ఇవ్వాలని బొంబాయి​ హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్​ సివిల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సివిల్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ వేసిన పిటిషన్​ను కొట్టివేసింది.

ఇదీ కేసు: 1992లో ఓ జంటకు వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో భర్త నుంచి విడాకులు ఇప్పించాలని 2015లో భార్య.. నాందేడ్​ సివిల్​ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు వారికి అదే ఏడాది విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్​ 24, 25 ప్రకారం భార్య నుంచి శాశ్వత భరణం, జీవనాధార ఖర్చులు ఇప్పించాలని కోరుతూ ఆమె భర్త పిటిషన్​ వేశారు. తనకు జీవనాధారం ఏమీ లేదని, భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మంచి వేతనం తీసుకుంటున్నట్లు పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ రోజు ఆమె ఆ స్థానంలో ఉండేందుకు తాను ఎంతో కష్టపడ్డానని తెలిపారు​. భర్త పిటిషన్​ను విచారణకు స్వీకరించిన నాందేడ్​ సివిల్​ కోర్టు.. భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించింది.

నాందేడ్​ సివిల్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ ఔరంగాబాద్​ హైకోర్టును ఆశ్రయించింది భార్య. విడాకులు మంజూరయ్యాక వారి బంధం ముగిసిపోయిందని.. ఎలాంటి భరణం, ఖర్చులు ఇవ్వాల్సిన అవసరం లేదని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్​ 25 ప్రకారం ఎప్పుడైనా భరణం కోరుతూ పిటిషన్​ వేయవచ్చన్నారు భర్త తరఫు న్యాయవాది రాజేశ్​ మెవారా. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. భర్తకు భార్య భరణం ఇవ్వాలని తీర్పు వెల్లడించింది.

సివిల్​ కోర్టులో వాదనలు, సమర్పించిన డాక్యుమెంట్లు, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు.. సివిల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రాల్లో కేంద్ర బలగాల పరిధి కుదింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.