ETV Bharat / bharat

Live Updates: స్కిల్ డెవలప్​మెంట్​ కేసులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న టీడీపీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 9:23 AM IST

Updated : Sep 22, 2023, 7:18 PM IST

acb_court_verdict_on_chandrababu_cid_custody_petition
acb_court_verdict_on_chandrababu_cid_custody_petition

19:17 September 22

చంద్రబాబు అరెస్టును ఖండించిన తెలంగాణ స్పీకర్ పోచారం

  • చంద్రబాబు అరెస్టును ఖండించిన తెలంగాణ స్పీకర్ పోచారం
  • చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం: పోచారం శ్రీనివాస్‌ రెడ్డి
  • రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు: పోచారం
  • చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో తెలపకపోవడం బాధాకరం: పోచారం
  • ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం చేయకూడదు: పోచారం
  • రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదు: తెలంగాణ స్పీకర్‌

19:17 September 22

చంద్రబాబు కోసం దిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ప్రార్ధనలు

  • చంద్రబాబు కోసం దిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ప్రార్ధనలు
  • చంద్రబాబు విడుదల కావాలని కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా ప్రార్ధనలు
  • దిల్లీ: దర్గా వద్ద చాదర్ సమర్పించి దువా చేసిన చాంద్‌బాషా
  • దిల్లీ: రేపు అజ్మీర్ దర్గాకు వెళ్లి ప్రార్ధనలు చేస్తానన్న చాంద్‌బాషా

16:53 September 22

స్కిల్ డెవలప్​మెంట్​ కేసులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న టీడీపీ

  • స్కిల్ కేసు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న టీడీపీ
  • న్యాయ పోరాటం దృష్ట్యా కొన్ని రోజులు దిల్లీలోనే ఉండాలని లోకేశ్​ నిర్ణయం
  • న్యాయవాదులతో నారా లోకేశ్​ వరుస సమీక్షలు
  • సాయంత్రం రాజమండ్రికి తిరిగి రావాలనుకున్న లోకేశ్​
  • హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేతతో మారిన పరిణామాలు
  • ఎప్పటికప్పుడు న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్న లోకేశ్​
  • సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై లాయర్లతో చర్చిస్తున్న లోకేశ్​

16:53 September 22

టీడీపీలో ప్రతీ కార్యకర్త ఓ నాయకుడే: అచ్చెన్నాయుడు

  • టీడీపీలో ప్రతీ కార్యకర్త ఓ నాయకుడే: అచ్చెన్నాయుడు
  • టీడీపీలో ప్రతీ నాయకుడు ఓ చంద్రబాబే: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబును అరెస్టు చేస్తే టీడీపీని ఓడించవచ్చనే భ్రమలో ఉన్నారు: అచ్చెన్న
  • పార్టీ తరఫున రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి: అచ్చెన్నాయుడు
  • గ్రామాల్లో బాబుతో నేను కార్యక్రమం కొనసాగిస్తాం: అచ్చెన్నాయుడు
  • గ్రామాల్లో ప్రతి గడప తట్టి జగన్ అక్రమాలు వివరిస్తాం: అచ్చెన్నాయుడు
  • కేసు విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తాం: అచ్చెన్నాయుడు

15:03 September 22

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు సీఐడీ కస్టడీ

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు సీఐడీ కస్టడీ
  • చంద్రబాబు సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి
  • చంద్రబాబును రెండ్రోజులపాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశం
  • రాజమండ్రి జైలులోనే విచారణ చేయాలని సీఐడీకి ఆదేశం
  • న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశం
  • విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని కోరిన ఏసీబీ కోర్టు
  • ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు సీఐడీ విచారణకు అనుమతి
  • విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదన్న కోర్టు
  • ఆదివారం కస్టడీ ముగిశాక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని సూచన

14:11 September 22

  • కాసేపట్లో చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు
  • చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు

14:10 September 22

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహారదీక్ష

  • అనంతపురం: మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహారదీక్ష
  • రాయదుర్గంలోని శాంతినగర్‌లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష
  • చంద్రబాబును విడుదల చేసేవరకు దీక్ష చేయనున్నట్లు కాలవ శ్రీనివాసులు ప్రకటన

12:35 September 22

  • చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు మధ్యాహ్నం 2.30కి వాయిదా
  • తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
  • హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై మధ్యాహ్నం తీర్పు వచ్చే అవకాశం

12:34 September 22

  • చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
  • చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఈ నెల 24 వరకు పొడిగింపు
  • రిమాండ్ ముగియడంతో చంద్రబాబును వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాలు కోరిన ఏసీబీ కోర్టు జడ్జి

10:51 September 22

  • రిమాండ్ సమయం ముగియడంతో చంద్రబాబును కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు
  • చంద్రబాబును వర్చువల్‌గా కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు
  • సీఐడీ కస్టడీపై చంద్రబాబు అభిప్రాయం కోరిన న్యాయమూర్తి

10:43 September 22

ఆన్‌లైన్‌ ద్వారా కోర్టుకు హాజరైన చంద్రబాబు

సీఐడీ కస్టడీపై చంద్రబాబు అభిప్రాయం కోరిన న్యాయమూర్తి

10:43 September 22

మంగళగిరిలో తొమ్మిదో రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

నియోజకవర్గ వాణిజ్య, టీఎన్‌టీయూసీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో దీక్షలు

మంగళగిరి వైష్ణవి కల్యాణ మండపం పక్కన రిలే నిరాహార దీక్షలు

చంద్రబాబుతో నేను సైతం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు

10:07 September 22

చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు

  • చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు
  • తీర్పు వెలువరించనున్న విజయవాడ ఏసీబీ కోర్టు

10:07 September 22

చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటుపై కేసు నమోదు

  • బాపట్ల: కొత్త ఓడరేవు తీరంలో చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటుపై కేసు
  • చింతకాయల విజయ్, వేగేశ్న నరేంద్రవర్మ సహా 28 మంది నేతలపై కేసు
  • 144 సెక్షన్ ఉండగా నిరనస తెలిపారని కేసు నమోదు చేసిన బాపట్ల పోలీసులు
  • సముద్ర తీరంలో 144 సెక్షన్ ఏంటని విస్తుపోతున్న తెదేపా శ్రేణులు

10:06 September 22

నంద్యాలలో భూమా అఖిలప్రియ, జగద్విఖ్యాతరెడ్డి నిరాహార దీక్ష

  • నంద్యాలలో భూమా అఖిలప్రియ, జగద్విఖ్యాతరెడ్డి నిరాహార దీక్ష
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అఖిలప్రియ, జగద్విఖ్యాతరెడ్డి దీక్ష
  • చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్‌కే ఫంక్షన్ హాలు వద్ద ఆమరణ నిరాహార దీక్ష

10:06 September 22

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తిరుపతిలో టీడీపీ నేతల దీక్షలు

  • తిరుపతి: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా నేతల దీక్షలు
  • తిరుపతి నగరపాలక కార్యాలయం ముందు కొనసాగుతున్న దీక్షలు
  • తిరుపతి: నిరాహార దీక్షలో పాల్గొన్న సుగుణమ్మ, నరసింహ యాదవ్

09:10 September 22

చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు

  • చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు
  • ఉదయం 10.30 గం.కు తీర్పు వెలువరించనున్న ఏసీబీ కోర్టు

09:10 September 22

సీఐడీ పీటీ వారెంట్లపై నేడు విచారణ చేపడతామన్న ఏసీబీ కోర్టు

  • సీఐడీ పీటీ వారెంట్లపై నేడు విచారణ చేపడతామన్న ఏసీబీ కోర్టు
  • అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో పీటీ వారెంట్లు వేసిన సీఐడీ

09:09 September 22

తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

  • తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన
  • తెదేపా శాసనసభాపక్ష నిరసనలో పాల్గొన్న వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు
  • చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని నినాదాలు
  • తుళ్లూరు స్టేషన్ నుంచి నినాదాలతో కాలినడకన శాసనసభకు వెళ్లిన నేతలు

09:09 September 22

బొబ్బిలిలో టీడీపీ నేత బేబినాయన అరెస్టు

  • విజయనగరం: బొబ్బిలిలో తెదేపా నేత బేబినాయన అరెస్టు
  • బొబ్బిలి నుంచి సింహాచలం వరకు పాదయాత్రకు పిలుపునిచ్చిన తెదేపా
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పాదయాత్రకు తెదేపా నేతల పిలుపు
  • బొబ్బిలిలో తెదేపా నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు

09:08 September 22

శాసనసభలో రెండోరోజూ చంద్రబాబు అరెస్టుపై చర్చకు పట్టుబట్టనున్న తెదేపా

  • శాసనసభలో రెండోరోజూ చంద్రబాబు అరెస్టుపై చర్చకు పట్టుబట్టనున్న తెదేపా
  • అధికారపక్షం ఎంత దూకుడుగా వెళ్లినా వెనక్కి తగ్గకూడదని నిర్ణయం
  • శాసన మండలిలోనూ దూకుడుగా ముందుకెళ్లాలని తెదేపా నిర్ణయం
  • సభలో పవర్‌పాయింట్‌కు అనుమతిస్తే తమకూ ఇవ్వాలని పట్టుబట్టనున్న తెదేపా
  • చంద్రబాబును విడుదల చేసి, సీఎం క్షమాపణ చెప్పాలని తెదేపా నేతల డిమాండ్‌

09:07 September 22

చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై నేడు వెలువడనున్న నిర్ణయం

  • చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై నేడు వెలువడనున్న నిర్ణయం
  • ఇవాళ ఉ.10.30 గం.కు నిర్ణయం వెలువరించనున్న ఏసీబీ కోర్టు
  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉన్న దృష్ట్యా తీర్పు వాయిదా
  • హైకోర్టులో నేటి కేసుల జాబితాలో లేని క్వాష్‌ పిటిషన్‌

09:07 September 22

సీఐడీ పీటీ వారెంట్లపై నేడు విచారణ చేపడతామన్న ఏసీబీ కోర్టు

  • సీఐడీ పీటీ వారెంట్లపై నేడు విచారణ చేపడతామన్న ఏసీబీ కోర్టు
  • అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో పీటీ వారెంట్లు వేసిన సీఐడీ

09:07 September 22

Live Updates: సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై లాయర్లతో చర్చిస్తున్న లోకేశ్​

  • నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌
  • స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నేటితో ముగింపు
  • తదుపరి ఆదేశాల కోసం విజయవాడ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరచనున్న అధికారులు
  • వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో చంద్రబాబును హాజరుపరచనున్న అధికారులు
Last Updated : Sep 22, 2023, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.